Viral Video: సినిమా స్టైల్‌లో రన్నింగ్ లారీలో దొంగతనం – చివరికి పోలీసులకు దొరికిపోయిన గ్యాంగ్!

x

Highlights

కొంతమంది చేసే దొంగతనాలు నిజంగానే సినిమా సీన్లలా అనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై పరుగులు తీస్తున్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కి, అందులోని వస్తువులను చాకచక్యంగా రోడ్డుపైకి విసిరేశారు. లారీ వెనుక బైక్‌లపై వస్తున్న వారి గ్యాంగ్ సభ్యులు వాటిని సేకరించేశారు.

ఈ సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్-ధులే హైవేపై రత్నాపూర్ గ్రామం సమీపంలో జరిగింది. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కి, కవర్ తొలగించి వస్తువులను రోడ్డుపైకి పడేశారు. ఆ వస్తువులను వారి తోటి సభ్యులు బైక్‌లపై ఫాలో అవుతూ తీసుకున్నారు.

ఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియో ధరాశివ్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే దర్యాప్తు చేపట్టారు. చివరకు ఈ దొంగతనంలో పాల్గొన్న ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

వీడియో చూడండి!

Show Full Article
Print Article
Next Story
More Stories