Viral Video: అడవిని దద్దరిల్లించిన రెండు సింహాల భీకర పోరాటం!

Viral Video: అడవిని దద్దరిల్లించిన రెండు సింహాల భీకర పోరాటం!
x

Viral Video: అడవిని దద్దరిల్లించిన రెండు సింహాల భీకర పోరాటం!

Highlights

రెండు సింహాలు ముఖాముఖి ఢీకొనడం ఎప్పుడైనా చూశారా? అలాంటి సన్నివేశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అడవి అంతా దద్దరిల్లేలా గర్జిస్తూ రెండు సింహాలు ఒకదానిపై ఒకటి దాడి చేయగా, ఆ దృశ్యం చూసిన నెటిజన్స్‌ షాక్ అయ్యారు.

ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని మాడిక్వే గేమ్ రిజర్వ్ లో జరిగింది. ఫోటోగ్రాఫర్ టెబాట్సో రోజ్ టెమా తన కెమెరాలో ఈ ఘట్టాన్ని బంధించారు. వీడియోలో రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన సింహాలు ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎవరు గెలుస్తారో ఊహించలేని రీతిలో గోళ్లతో, దాడులతో ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి.

సుమారు 45 సెకన్ల పాటు సాగిన ఈ పోరాటంలో ఒక సింహం ప్రత్యర్థిని కూలదోస్తుంది. కానీ మరొకటి లొంగిపోకుండా మళ్లీ దాడి చేస్తుంది. చివరికి ఎవరూ ఓడిపోని పరిస్థితిలో, రెండూ ఆగి వేరువేరు దారుల్లో నడుచుకుంటూ వెళ్లిపోయాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 50 లక్షలకు పైగా వీక్షణలు దక్కించుకుంది. నెటిజన్స్ తమ కామెంట్స్‌లో “రెండు గ్రహాలు ఢీకొన్నట్లుంది” అంటూ అబ్బురపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories