Viral Video: బామ్మకు పెట్టకుండా తింటే ఊరుకుంటానా..యజమాని తలపై కొట్టిన పెంపుడు కుక్క.. వైరల్ వీడియో

Viral Video
x

Viral Video: బామ్మకు పెట్టకుండా తింటే ఊరుకుంటానా..యజమాని తలపై కొట్టిన పెంపుడు కుక్క.. వైరల్ వీడియో

Highlights

Viral Video: సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కుక్క చేసిన పనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపడటమే కాదు పెద్ద వాళ్ల గురించి ఇప్పుడు మనుషులే ఆలోచించడం లేదు.. కుక్క ఆలోచించడం భలే ఉందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

ఒక యజమాని వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి యాపిల్ ముక్కలను తినిపించడానికి సోఫాలో కూర్చుని ఉన్న తల్లి దగ్గర వెళ్లి కూర్చుంటాడు. అదే సమయంలో వాళ్ల పెంపుడు కుక్క గోల్డెన్ రిట్రీవర్ కూడా సోఫాలో ఆ బామ్మ పక్కనే కూర్చుని ఉంటుంది. అయితే యజమాని ఏం చేస్తాడంటే ఒక యాపిల్‌ ముక్కను మొదట కుక్క నోట్లో పెట్టడానికి చూస్తాడు. కానీ విచిత్రంగా ఆ కుక్క నాకొద్దు బామ్మకు పెట్టమని చూపిస్తుంది. ఒకే అంటూ యజమాని ఒక ముక్కను తీసి బామ్మకు పెడతానని ఆమె నోరు వరకు తీసుకెళతాడు. కానీ వెంటనే దాన్ని తన నోటిలో వేసుకుంటాడు. ఇంకేం ముందు ఆ కుక్క వెంటనే బామ్మకు పెట్టకుండా నువ్వు తింటావా అన్నట్టు అతని తలపై దబదబా విమానం మోత మోయించేస్తుంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిధా అయిపోతున్నారు. బామ్మలను ఈ జనరేషన్‌లో ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదు. కానీ కుక్క ఆమె అంటే ఎంత విశ్వాసమో కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కుక్క విశ్వాసానికి మారు పేరు అని విన్నాం. కానీ ఈ రోజు చూస్తున్నాం. తనకు కూడా వద్దని బామ్మకు పెట్టమని పైగా ఆ బామ్మను టచ్ చేసి యజమానికి చూపించడం రియల్లీ అద్బుతమైన ఫీలింగ్. అందుకే నెటిజన్లు ఈవీడియోని చూసి శభాష్ రిట్రీవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజమే కదా ఉంటే అలాంటి కుక్కే ఒకటి ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories