Viral Video: ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన పాము.. వీడియో చూస్తే హ‌డ‌ల్ అంతే

Viral Video
x

Viral Video: ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన పాము.. వీడియో చూస్తే హ‌డ‌ల్ అంతే

Highlights

Viral Video: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముగా గుర్తింపు పొందిన కింగ్ కోబ్రా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది.

Viral Video: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముగా గుర్తింపు పొందిన కింగ్ కోబ్రా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ పామును అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైందిగా చెబుతుంటారు. ఇటీవలి కాలంలో కింగ్ కోబ్రాలను పట్టడం, వాటిని తిరిగి అడవికి వదిలిపెట్టే స్నేక్ క్యాచింగ్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా ఓ కింగ్ కోబ్రా వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇటీవల వచ్చిన భారీ వర్షాల వల్ల కొండలపై నుండి నీరు భారీగా ప్రవహించింది. ఈ వరదల్లో కొండల్లో నివాసం ఉండే నాగుపాములు కూడా కొట్టుకువచ్చి జనవాసాల వద్ద కనిపిస్తున్నాయి. తాజా ఘటనలో, దాదాపు ఆరు మీటర్ల పొడవున్న ఓ భారీ కింగ్ కోబ్రా ఒక నివాసానికి సమీపంలో కనిపించింది. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు.

స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకుని చాలా జాగ్రత్తగా పామును నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆ పాము పూర్తిగా తన పడగ విప్పి స్నేక్ క్యాచ‌ర్‌పై దాడి చేసింది. నెమ్మదిగా దాని తోక పట్టుకున్నాడు.. అయితే ఆ కింగ్ కోబ్రా వేగంగా కదులుతూ పలుమార్లు అత‌నిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

అయితే కొద్ది సేప‌టి త‌ర్వాత స్నేక్ క్యాచర్ పాము తల భాగాన్ని పట్టుకుని దానిని సంచిలో బంధించారు. ఆ పామును తర్వాత పర్వత ప్రాంతంలోని సురక్షితమైన అడవిలో వదిలిపెట్టారు. ఈ వీడియోను చూసిన ప్రజలు స్నేక్ క్యాచర్‌ ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories