Couple: ఈ జంట ఆస్తుల విలువ అక్ష‌రాల రూ. 1300 కోట్లు..

Couple: ఈ జంట ఆస్తుల విలువ అక్ష‌రాల రూ. 1300 కోట్లు..
x
Highlights

Celebrity Couple: భారతదేశంలో సెలబ్రిటీ పెళ్లిళ్లు సాధారణమే అయినా, కొన్ని జంటలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి.

Celebrity Couple: భారతదేశంలో సెలబ్రిటీ పెళ్లిళ్లు సాధారణమే అయినా, కొన్ని జంటలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఒకే రంగంలో ఉన్న స్టార్‌లు వివాహం చేసుకోవడం స‌ర్వ‌సాధార‌ణం. కానీ రెండు వేర్వేరు రంగాల్లో ఉన్న స్టార్ సెల‌బ్రిటీలు ఒక్క‌ట‌వ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది.

అలాంటి జంటల్లో కోహ్లీ – అనుష్క శర్మ ముందు వరుసలో ఉంటారు. వ్యక్తిగత ఫ్యాన్ బేస్ మాత్రమే కాదు, వీరిద్దరూ కలసిన తర్వాత వారి పేరు, ఆదాయం, వ్యాపార సామర్థ్యం దూసుకుపోయాయి. 2025 నాటికి వీరి కలిపిన ఆస్తుల విలువ అక్ష‌రాల రూ.1,300 కోట్లు అంటే న‌మ్ముతారా.? ఇంత‌కీ వీరిద్ద‌రిలో ఎవ‌రెవ‌ర‌కి ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

కోహ్లి ఆదాయం ఎంతంటే:

భారత క్రికెటర్లలో అత్యధికంగా సంపాదించే వ్యక్తిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా ఏటా రూ.7 కోట్లు, ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కు రూ.3 లక్షలు మ్యాచ్ ఫీజులుగా అందుకుంటాడు. IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2025లో రూ.21 కోట్లు రెమ్యునరేషన్ పొందాడు.

2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ నుంచే రూ.212 కోట్లు సంపాదించాడు.

బ్రాండ్ల ప్రచారం కోహ్లీకి ప్రత్యేకమైన ఆదాయ మార్గం ఉంది. పూమా, ఎమ్ఆర్‌పఫ్‌, మింత్రా వంటి 30కి పైగా బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ, ఒక్కో బ్రాండ్ డీల్‌కు రూ.5-10 కోట్లు వరకు తీసుకుంటాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ద్వారా ఒక్క పోస్ట్‌కే రూ.8.9 కోట్లు వసూలు చేస్తాడనే సమాచారం ఉంది. వీటి ద్వారానే కోహ్లీ ఏడాదికి రూ. 175-200 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.

వ్యాపారాల్లోనూ దూసుకుపోతున్న కోహ్లి:

బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానే కాకుండా సొంత వ్యాపారాల్లోనూ కోహ్లి దూసుకుపోతున్నాడు. WROGN (దుస్తుల బ్రాండ్), One8 (పూమాతో కలిసిన ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ వెంచర్), చిజెల్ జిమ్స్‌, న్యూవా రెస్టారెంట్‌, FC గోవా ఫుట్‌బాల్ క్లబ్‌లో వాటాలు, డిజిట్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడులు ఉన్నాయి. ఈ వ్యాపారాల ద్వారా కోహ్లి ఏటా సుమారు రూ. 40 కోట్ల వ‌ర‌కు ఆర్జిస్తున్నాడు.

రియ‌ల్ ఎస్టేట్‌లోనూ:

ఇక రియల్ ఎస్టేట్‌లో కోహ్లీ ముంబై, గుర్గావ్, అలీబాగ్ ప్రాంతాల్లో విలాసవంతమైన ప్రాపర్టీలు కలిగి ఉన్నాడు.

గుర్గావ్ – రూ.80 కోట్లు విలువైన భవంతి, ముంబై – రూ.34 కోట్లు విలువైన అపార్ట్‌మెంట్, అలీబాగ్ – రూ.19 కోట్ల విల్లా కోహ్లి సొంతం.

అనుష్క విష‌యానికొస్తే:

ఇక అనుష్క విష‌యానికొస్తే ఈ మ‌ధ్య సినిమాలు త‌గ్గించినా అనుష్క శర్మ సంపాదనలో ఏమాత్రం తగ్గలేదు. ఒక్కో సినిమాకు రూ.7 నుంచి 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ర‌న్ చేస్తోంది. దీని ద్వారా పలు హిట్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మించారు. పూమా, లైవ్ స్పేస్ వంటి బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఏటా రూ. 5 నుంచి 10 కోట్లు సంపాదిస్తోంది. న్యూష్ అనే ఫ్యాష‌న్ బ్రాండ్‌ను అనుష్క ర‌న్ చేస్తోంది. ఇలా అనుష్క‌కు సుమారు రూ. 250 కోట్ల ఆస్తి ఉంద‌ని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories