Snake vs Mongoose: ముంగిస అంటే పాముకు ఎందుకంత భయం, రెండింటి మధ్య శత్రుత్వం ఎందుకో తెలుసా

Snake vs Mongoose
x

Snake vs Mongoose: ముంగిస అంటే పాముకు ఎందుకంత భయం, రెండింటి మధ్య శత్రుత్వం ఎందుకో తెలుసా

Highlights

Snake vs Mongoose: అసలు ఈ రెండు జీవుల మధ్య ఇంతటి వైరం ఎందుకు? విషసర్పాలను చూస్తే ముంగిసకు కోపం ఎందుకు? ముంగిసను చూస్తే పాముకు అంత భయం దేనికి? ఈ ఉత్కంఠభరిత రహస్యాలను పరిశోధకులు ఎలా ఛేదించారో చూద్దాం.

Snake vs Mongoose: ప్రకృతిలో జీవ వైవిధ్యం ఎంత ఉందో, జీవ వైరం కూడా అంతే బలంగా ఉంటుంది. "తాటిని తన్నే వాడుంటే, దాని తల పగులగొట్టేవాడు మరొకడుంటాడు" అన్నట్టుగా జంతు ప్రపంచంలో ఆజన్మాంతం కొనసాగే శత్రుత్వం కొన్ని జీవుల మధ్య కనిపిస్తుంది. పిల్లి-ఎలుక పోరాటం గురించి మాట్లాడుకునేట్టే, పాము-ముంగిస శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి పొరపాటున ఎదురుపడ్డాయంటే, భీకర యుద్ధం జరగాల్సిందే!

అసలు ఈ రెండు జీవుల మధ్య ఇంతటి వైరం ఎందుకు? విషసర్పాలను చూస్తే ముంగిసకు కోపం ఎందుకు? ముంగిసను చూస్తే పాముకు అంత భయం దేనికి? ఈ ఉత్కంఠభరిత రహస్యాలను పరిశోధకులు ఎలా ఛేదించారో చూద్దాం.

పాములే ఎందుకు తోక ముడుస్తాయి?

ఎవరైనా తరచూ గొడవ పడుతుంటే 'పాము-ముంగిసలా కొట్టుకుంటున్నారు' అని అంటుంటాం. ఈ పోరాటంలో ఎక్కువ భయపడేది, ఓడిపోయేది మాత్రం పాములే! అందుకు కారణం ముంగిసల్లో ఉన్న ప్రత్యేకమైన పోరాట నైపుణ్యం (Specialized Skills).

విషాన్ని తట్టుకునే శక్తి: ముంగిస శరీరంలో అసిటిలకొలైన్ రెసెప్టార్స్ (Acetylcholine Receptors) ఉంటాయి. ఇవి పాము విషం శరీరంలోకి వెళ్లి నాడుల మీద ప్రభావం చూపకుండా అడ్డుకుంటాయి. అందుకే ఎన్నిసార్లు కాటు వేసినా వెనక్కి తగ్గకుండా, ఇంకా వేగంగా పాముపైకి దూకి కొరికేస్తాయి.

♦ అత్యంత వేగవంతమైన దాడి (Lightning Speed Attack): పాము చురుకుగా ఉంటుందనుకుంటే, ముంగిసలు అంతకంటే వేగంగా ఉంటాయి. పాము కదలక ముందే మెరుపు వేగంతో దాడి చేస్తూ, దానికి మెలికలు తిరగడానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేస్తాయి.

♦ తప్పించుకునే నేర్పు: పాము కాటు నుంచి తప్పించుకునే నైపుణ్యం ముంగిసలకు సహజంగానే ఉంటుంది. ముఖ్యంగా తలపైన కాటు పడితేనే ప్రమాదం కాబట్టి, ఆ ప్రాంతాన్ని కాపాడుకుంటూ, పాము తల భాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాయి. అందుకే ఎంతటి విషసర్పాలైనా ముంగిస ముందు తోక ముడవక తప్పదు.

పరిణామ క్రమంలోని వైరుధ్యం (Evolutionary Contrast)

ఈ రెండు జీవుల మధ్య వైరం కేవలం పోరాటం వరకే పరిమితం కాదు. పరిణామ క్రమంలో కూడా అవి విభిన్నంగా పెరుగుతూ వచ్చాయి.

పాములు: కాలక్రమేణా తమను తాము మరింత విషపూరితంగా మార్చుకుంటూ, బయోలాజికల్ మార్పులకు లోనవుతాయి.

ముంగిసలు: పాముల విషానికి ప్రభావితం కాకుండా ఉండేలా రెసిస్టెన్స్ పవర్‌ను సాధిస్తూ పరిణామం చెందుతాయి.

పాములతో ప్రతి పోరాటం నుంచి ముంగిసలు కొత్త ఫైటింగ్ టెక్నిక్‌ను నేర్చుకుంటాయి. ఈ అడాప్టబిలిటీ (Adaptability) వల్లే అవి పాములను అంత సులభంగా ఓడించగలుగుతున్నాయి.

మనుగడ కోసం పోరాటం (Survival Strategy)

ఈ భీకర పోరాటానికి మూలం 'ఆత్మరక్షణ' లేదా సర్వైవల్ స్ట్రాటెజీ అని పరిశోధకులు చెబుతున్నారు.

పాము: తన విషగుణంపై ఆధారపడి, వేగంగా కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది.

♦ ముంగిస: పాము వేగాన్ని మించి తప్పించుకుంటూ, దాడిలో పైచేయి సాధించడానికి తీవ్రంగా పోరాడుతుంది.

వేల, లక్షల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ శత్రుత్వంపై ఎన్నో డాక్యుమెంటరీలు, పరిశోధనలు జరిగాయి. ఈ రెండు జీవులు పకృతిలో మమేకమై జీవిస్తూనే, ఎప్పటికప్పుడు తమ పోరాట నైపుణ్యాన్ని పెంచుకోవాలని (స్కిల్ అప్‌గ్రేడేషన్) మనిషికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాయనడంలో సందేహం లేదు.

గమనిక: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. hmtv ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి hmtv బాధ్యత వహించదు.​

Show Full Article
Print Article
Next Story
More Stories