Oyo: ఓయో రూమ్‌లో ల‌వ‌ర్‌తో వివాహిత‌.. అంత‌లోనే భ‌ర్త ఎంట్రీ. ఏం చేసిందంటే. వైర‌ల్ వీడియో

Wife Escapes from Hotel Balcony After Husband Catches Her with Lover in Baghpat, Uttar Pradesh
x

Oyo: ఓయో రూమ్‌లో ల‌వ‌ర్‌తో వివాహిత‌.. అంత‌లోనే భ‌ర్త ఎంట్రీ. ఏం చేసిందంటే. వైర‌ల్ వీడియో

Highlights

Oyo: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా బడౌత్ పట్టణానికి చెందిన ఓ మహిళ 2019లో వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత మూడేళ్లుగా ఆమె భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

Oyo: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా బడౌత్ పట్టణానికి చెందిన ఓ మహిళ 2019లో వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత మూడేళ్లుగా ఆమె భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో ఆమె శోభిత్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంది. ఇద్దరూ తరచూ హోటళ్లలో కలుస్తున్నట్టు తెలిసింది.

భర్తకు ఈ వ్యవహారం గురించి అనుమానం కలగడంతో ఆమెను పలు మార్లు హెచ్చరించినా, ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా ఆమె మరోసారి ప్రియుడిని కలవడానికి బడౌత్‌లోని ఓ ఓయో రూమ్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లాడు.

హోటల్‌లో భర్తను, పోలీసులను చూసేస‌రికి ఒక్క‌సారిగా షాక్‌కి గురైంది. వెంటనే హోటల్ బాల్కనీ నుంచి పక్క ఇంటి మీదకు దూకి అక్కడి నుంచి పరారైంది. అయితే శోభిత్ మాత్రం హోటల్‌లోనే ఉండిపోయాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

మ‌హిళ హోట‌ల్ బాల్కనీ నుంచి దూకి పరారవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories