August 2025 Telugu Calendar: వరలక్ష్మీ వ్రతం నుంచి వినాయక చవితి వరకు ఆగస్టు నెల పండుగల వివరాలు ఇవే!

August 2025 Telugu Calendar
x

August 2025 Telugu Calendar: వరలక్ష్మీ వ్రతం నుంచి వినాయక చవితి వరకు ఆగస్టు నెల పండుగల వివరాలు ఇవే!

Highlights

August 2025 Telugu Festival Calendar: ఆగస్టు నెల హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. శ్రావణ మాసానికి ఆధ్యాత్మికతతో పాటు పవిత్రత కూడా ఉంటుంది.

August 2025 Telugu Calendar: ఆగస్టు నెల హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. శ్రావణ మాసానికి ఆధ్యాత్మికతతో పాటు పవిత్రత కూడా ఉంటుంది. ఈ మాసంలో వరుస పండుగలు, వ్రతాలు జరుపుకోవడం ప్రత్యేకత. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి వంటి ముఖ్యమైన పండుగలు వచ్చనున్నాయి. దీనితో పాటు శ్రావణ మాసం ముగిసి, భాద్రపద మాసం ప్రారంభమవుతుందన్నది మరో విశేషం.


ఆగస్టు 2025 పండుగల లిస్ట్


తేదీ పండుగ వారము
ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం శుక్రవారం
ఆగస్టు 9 రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) శనివారం
ఆగస్టు 16 శ్రీకృష్ణ జన్మాష్టమి శనివారం
ఆగస్టు 27 వినాయక చవితి బుధవారం


వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 8 (శుక్రవారం)

ఇది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన రోజు. సకల ఐశ్వర్యాలను ప్రసాదించే వరలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వివాహితలు దీర్ఘసుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) – ఆగస్టు 9 (శనివారం)

సోదరుడు – సోదరుల మధ్య బంధాన్ని బలపరిచే పండుగ. శ్రావణ పౌర్ణమినాడు చెల్లెలు లేదా అక్క సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, అతని రక్షణను కోరుతూ ప్రార్థిస్తుంది. ఇతిహాసాల ప్రకారం కృతయుగం నుంచే ఈ పండుగ జరుపుకుంటున్నట్లు పేర్కొనబడింది.

శ్రీకృష్ణ జన్మాష్టమి – ఆగస్టు 16 (శనివారం)

శ్రీకృష్ణ భగవానుడి అవతరణదినం. గోకులాష్టమి, కృష్ణాష్టమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. అష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి ప్రారంభమై 16 మధ్యాహ్నానికి ముగుస్తుంది. ఉదయతిథిని అనుసరించి ఆగస్టు 16న పూజలు నిర్వహించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

వినాయక చవితి – ఆగస్టు 27 (బుధవారం)

గణపతి బప్పా మోర్యా! హిందూ ధర్మంలో వినాయకుడిని విఘ్న నివారకుడిగా పూజిస్తారు. భాద్రపద శుద్ధ చవితినాడు జరుపుకునే ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా 10 రోజుల పాటు ఉత్సవాలుగా జరుగుతుంది. ఇంట్లో, మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తారు.

గమనిక: పై తేదీలు తెలుగు పంచాంగం ప్రకారం సూచించబడినవి. పంచాంగ ఆధారంగా ప్రాంతానుసారంగా తేడాలు ఉండే అవకాశముంది. కాబట్టి స్థానిక పండితుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories