Bathukamma 2025: బతుకమ్మ...ఏ రోజు ఏ పూజ, ఏ నైవేద్యం? పూర్తి వివరాలు ఇక్కడ!

Bathukamma 2025
x

Bathukamma 2025: బతుకమ్మ...ఏ రోజు ఏ పూజ, ఏ నైవేద్యం? పూర్తి వివరాలు ఇక్కడ!

Highlights

Bathukamma 2025: దసరా నవరాత్రులతో సమానంగా తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రకృతితో మనిషికి ఉన్న బంధాన్ని చాటి చెప్పే ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను పూజిస్తూ నిర్వహిస్తారు.

Bathukamma 2025: దసరా నవరాత్రులతో సమానంగా తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ప్రకృతితో మనిషికి ఉన్న బంధాన్ని చాటి చెప్పే ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను పూజిస్తూ నిర్వహిస్తారు. మహాలయ అమావాస్య నుంచి ప్రారంభమై దుర్గాష్టమి వరకు సాగే ఈ ఉత్సవాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ప్రసాదాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న మొదలై సెప్టెంబర్ 30 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

రోజుల వారీగా బతుకమ్మ పూజ, నైవేద్యం

మొదటి రోజు: ఎంగిలి పూల బతుకమ్మ

  • తేది: మహాలయ అమావాస్య

  • విశేషం: ఈ రోజు కోసం ముందు రోజు సేకరించిన పూలను వాడిపోకుండా నీటిలో ఉంచి, మరుసటి రోజు బతుకమ్మను పేర్చుతారు. పూర్వీకులకు అన్నదానం చేసిన తర్వాత ఈ పూజలు చేస్తారు కాబట్టి దీనిని 'ఎంగిలి పూల బతుకమ్మ' అంటారు.

  • నైవేద్యం: నువ్వులు, బియ్యం పిండితో చేసిన ప్రసాదం సమర్పిస్తారు.

రెండో రోజు: అటుకుల బతుకమ్మ

  • తేది: దసరా నవరాత్రులలో మొదటి రోజు, ఆశ్వయుజ మాసం పాడ్యమి

  • విశేషం: తంగేడు, గునుగు, బంతిపూలు, చామంతి, గడ్డిపూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు.

  • నైవేద్యం: బెల్లం, అటుకులను నైవేద్యంగా పెడతారు.

మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ

  • తేది: ఆశ్వయుజ మాసం విదియ

  • విశేషం: చామంతి, మందారం, సీతమ్మ జడ వంటి పూలను పేర్చి గౌరమ్మను పూజిస్తారు.

  • నైవేద్యం: ముద్దపప్పు, పాలు, బెల్లంతో కలిపి ప్రసాదంగా సమర్పిస్తారు.

నాలుగో రోజు: నాన బియ్యం బతుకమ్మ

  • తేది: ఆశ్వయుజ మాసం తదియ

  • విశేషం: తంగేడు, గునుగు వంటి పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను ఆరాధిస్తారు.

  • నైవేద్యం: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని నివేదిస్తారు.

ఐదో రోజు: అట్ల బతుకమ్మ

  • తేది: ఆశ్వయుజ మాసం చవితి

  • నైవేద్యం: గౌరమ్మకు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోసెలు సమర్పిస్తారు.

ఆరో రోజు: అలిగిన బతుకమ్మ

  • తేది: ఆశ్వయుజ మాసం పంచమి

  • విశేషం: ఈ రోజు బతుకమ్మ అలిగి ఉంటుందని, ఏమీ తినదని ఒక నమ్మకం. అందుకే ఈ రోజు నైవేద్యం సమర్పించరు.

ఏడో రోజు: వేపకాయ బతుకమ్మ

  • తేది: ఆశ్వయుజ మాసం శుక్ల షష్ఠి

  • నైవేద్యం: బియ్యం పిండిని బాగా వేయించి, వేప పండ్ల ఆకారంలో చేసి నైవేద్యంగా పెడతారు.

ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ

  • తేది: ఆశ్వయుజ మాసం శుక్ల సప్తమి

  • నైవేద్యం: నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపిన వెన్నముద్దలను నివేదిస్తారు.

తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ

  • తేది: ఆశ్వయుజ మాసం శుక్ల అష్టమి

  • విశేషం: బతుకమ్మ పండుగలో చివరి రోజు. ఈ రోజు ఊరూవాడా సంబరాలు అంబరాన్ని తాకుతాయి. గౌరమ్మను పూజించి, చిన్నా, పెద్దా అంతా కలిసి ఆడిపాడి నిమజ్జనం చేస్తారు.

  • నైవేద్యం: ఈ రోజు ఐదు రకాల సద్దులను (నైవేద్యాలను) సమర్పించడం ఆనవాయితీ.


Show Full Article
Print Article
Next Story
More Stories