Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

Arun Chilukuri
Published on: 15 July 2021 9:21 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 15th July 2021
X

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం | సూర్యోదయం : 5.36| సూర్యాస్తమయం సా.6.34| తిథి శు.షష్టిఉ.4.10 వరకు తదుపరి సప్తమి శుక్రవారం వరకు|నక్షత్రం ఉత్తర రా.2.22 వరకు| తదుపరి హస్త|రాహుకాలం : ప. 1.30 నుంచి 3.00 వరకు| యమగండం ఉ.06.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం ఉ.09.58 నుంచి 11.34 వరకు| దుర్ముహూర్తం ఉ.09.55 నుంచి 10.47 వరకు పున: మ. 3.06 నుంచి 3.58 వరకు| అమృతఘడియలు రా.07.20 నుంచి 8.54 వరకు.

మేషం: కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. ఉద్యోగులకు పనిభారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.

మిథునం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుసుకుంటారు.

సింహ: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులకు అన్ని విధాలా సమయం బాగుంది.

కన్య: ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి డోకా లేదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు.

తుల: బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. లాయర్లకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు.

వృశ్చికం: ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధివారికి, వృత్తి నిపుణులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

ధనుస్సు: ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సమయం మీకు అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది.

మకరం: ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధ తప్పదు. వ్యాపారంలో కొద్దిగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

కుంభం: ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు.

మీనం: ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు లేదు. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story