Dream Meaning: చనిపోయిన వారు కలలో కనిపిస్తే మంచిదా? చెడు జరుగుతుందా?

Dream Meaning: చనిపోయిన వారు కలలో కనిపిస్తే మంచిదా? చెడు జరుగుతుందా?
x
Highlights

Dream Meaning Of Dead Person: రాత్రి పడుకున్న సమయంలో ఏవో మనకు కలలో కనిపిస్తాయి. అయితే కొంతమందికి రోజంతా జరిగిన విషయాలు కలలోకి వస్తే మరికొన్ని కొత్తగా అనిపించవచ్చు.

Dream Meaning Of Dead Person: రాత్రి పడుకున్న సమయంలో ఏవో మనకు కలలో కనిపిస్తాయి. అయితే కొంతమందికి రోజంతా జరిగిన విషయాలు కలలోకి వస్తే మరికొన్ని కొత్తగా అనిపించవచ్చు. ఇందులో కొన్ని భయానకంగా అనిపిస్తాయి మరికొన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే కొన్ని సార్లు కలలో చనిపోయిన వారు కనిపిస్తారు. దీంతో చాలా కంగారు పడతారు. అయితే కలలో చనిపోయిన వారు కనిపిస్తే మంచిదా? చెడ్డదా ?పండితులు ఏం చెబుతున్నారు.

సాధారణంగా మనం పడుకున్నప్పుడు రకరకాల కలలు వస్తాయి. ఇందులో మనకు స్నేహితులే కానీ బంధువులే కానీ చనిపోయిన వాళ్ళు కూడా వస్తారు. ఒక్కోసారి కలలో దేవుళ్ళని కూడా చూస్తాం. ఇలా చూడటం వల్ల ఆనందం సంపాదన సూచిస్తుంది. ముఖ్యంగా విష్ణు, గణేషుడు, శివుడు వంటి వాళ్ళని కలలో చూస్తే భవిష్యత్తులో మీకు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని చెబుతారు .

కలలో ఒకవేల చనిపోయిన వారిని చూస్తే మీకు శుభ ఫలితాలు ఇస్తాయని అర్థం. ఒక్కోసారి మన జ్ఞాపకాలను కలలో వారితో ముడిపడి ఉన్నవి కనిపిస్తాయి. ఇది మాత్రమే కాదు కొన్నిసార్లు పైనుంచి మనం పడిపోయినట్టు కల కూడా వస్తుంది ఇది కూడా మనం జీవితంలో తీసుకునే నిర్ణయాలను ఒకసారి పునః పరిశీలించుకునేందుకు అర్థం.

కొంతమందికి పెళ్లి కళ వస్తుంది. ఇవి చూడటం వల్ల మీ కోరికలను ప్రతిబింబిస్తాయి. ఇక పెళ్లయిన వాళ్ళు సంపాదన పొందబోతున్నారని అర్థం . మరి కొంతమందికి కలలో పాము వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మందికి పాము కలలో వస్తుందని అధ్యాయాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇది శత్రువుల కుతంత్రాలను సూచిస్తుంది. మీకు ఏ క్షణంలో అయినా ప్రమాదం తప్పదని సంకేతంగా భావం. అలాంటి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి

(గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ వనరుల నుండి సేకరించబడింది. HMTV Telugu News దీనిని నిర్ధారించలేదు.)

Show Full Article
Print Article
Next Story
More Stories