గురునానక్ జయంతి 2025: కార్తీక పౌర్ణమి రోజే గురుపర్వ్! దేశంలోని ప్రసిద్ధ గురుద్వారాలు ఇవే

గురునానక్ జయంతి 2025: కార్తీక పౌర్ణమి రోజే గురుపర్వ్! దేశంలోని ప్రసిద్ధ గురుద్వారాలు ఇవే
x
Highlights

గురునానక్ జయంతి 2025 నవంబర్ 5న కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధ గురుద్వారాల్లో కీర్తన, లంగర్ సేవలు, భక్తుల సందడి ఉంటుంది.

కార్తీక పౌర్ణమి రోజైన నవంబర్ 5, 2025న గురునానక్ జయంతి జరుపుకుంటారు. గురు నానక్ దేవ్ జీ జన్మదినాన్ని సిక్కు భక్తులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. గురుద్వారాల్లో కీర్తన దర్బార్, లంగర్, సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దేశంలోని ప్రముఖ గురుద్వారాల్లో భక్తుల సందడి నెలకొంటుంది.

భారతదేశంలోని ప్రసిద్ధ గురుద్వారాలు

1️.గురుద్వారా హజూర్ సాహిబ్, నాందేడ్ (మహారాష్ట్ర)

గురు గోబింద్ సింగ్ జీ సమాధి స్థలం ఇది. గురుపర్వ్ సందర్భంగా అఖండ పాఠ్‌, శోభాయాత్రలు, విద్యుద్దీపాలతో అలంకరణలు జరుగుతాయి.

2️.గురుద్వారా బంగ్లా సాహిబ్, ఢిల్లీ

రాజధాని హృదయంలో ఉన్న ఈ పవిత్ర స్థలంలో గురుబానీ పఠనం, లంగర్ సేవలు, కీర్తన దర్బార్ జరుగుతాయి. గురు హర్కిషన్ దేవ్ గౌరవార్థం ఈ స్థలం నిర్మించబడింది.

3️.గురుద్వారా హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్), అమృత్‌సర్

సిక్కు మతానికి ఆధ్యాత్మిక కేంద్రం. గురుపర్వ్ సందర్భంగా ఇక్కడ దీపోత్సవం లా వెలుగుల హారతులు ఇస్తారు.

4️.గురుద్వారా హరమందిర్ జీ, పట్నా

పట్నా సాహిబ్ గురుద్వారా సిక్కు మతంలోని ఐదు పవిత్ర తఖ్త్‌లలో ఒకటి. మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు.

5️.తఖ్త్ శ్రీ దమ్దమా సాహిబ్, పంజాబ్

ఇక్కడ గురు గోవింద్ సింగ్ జీ 1705లో గురు గ్రంథ్ సాహిబ్ పారాయణం పూర్తి చేశారు. గురుపర్వ్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories