Karthika Masam: ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు? ఎలా పెట్టాలి? తెలుసుకోండి

Karthika Masam: ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు? ఎలా పెట్టాలి? తెలుసుకోండి
x

Karthika Masam: ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు? ఎలా పెట్టాలి? తెలుసుకోండి

Highlights

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో శివకేశవుల ఆరాధన, దీపారాధన, దానం, జపం, స్నానం వంటి ఆచారాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో శివకేశవుల ఆరాధన, దీపారాధన, దానం, జపం, స్నానం వంటి ఆచారాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యేకంగా ఉసిరి చెట్టు పూజ, ఉసిరి దీపం వెలిగించడం ఈ మాసంలో ఎంతో శుభప్రదంగా భావిస్తారు.

ఉసిరి చెట్టు ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు శివుని స్వరూపంగా, అలాగే లక్ష్మీదేవి ప్రతిరూపంగా పరిగణిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం ద్వారా శివకేశవుల అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని విశ్వాసం ఉంది. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణంలో కూడా ఉసిరి పూజా మహిమ వివరించబడింది.

ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు?

కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగి సకల శుభఫలాలు కలుగుతాయని నమ్ముతారు.

ఉసిరి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం.

నవగ్రహ దోషాలు తొలగి, కుటుంబంలో ఐశ్వర్యం చేకూరుతుందని చెబుతారు.

ఉసిరి దీపం ఎలా పెట్టాలి?

ముందుగా శుభ్రంగా స్నానం చేసి పసుపు, కుంకుమలు వేసిన ముగ్గు వేసి ప్రదేశాన్ని శుద్ధి చేయాలి.

ఉసిరికాయను తీసుకుని పైభాగాన్ని గుండ్రంగా కట్ చేయాలి.

అందులో నెయ్యి లేదా నూనె వేసి తామర కాడతో చేసిన వత్తిను పెట్టాలి.

దీపాన్ని ‘ఓం శ్రీ కార్తిక దామోదరాయ నమః’ అనే మంత్రంతో వెలిగించాలి.

దీపాన్ని శివాలయం లేదా విష్ణు ఆలయం ప్రాంగణంలో, లేదా ఉసిరి చెట్టు కింద వెలిగించడం అత్యంత శ్రేయస్కరం.

ఉసిరి దీపం పూజలో పఠించాల్సిన నామాలు

ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించే వారు ఈ 21 నామాలను పఠిస్తే అత్యంత శుభఫలాలు లభిస్తాయని చెబుతారు:

ఓం ధాత్రై నమః

ఓం రామాయై నమః

ఓం శాంత్యై నమః

ఓం లోకమాత్రై నమః

ఓం కాంత్యై నమః

ఓం ఆబ్ధితనయాయై నమః

ఓం మేధాయై నమః

ఓం గాయత్రీయై నమః

ఓం కళ్యాణై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం విశ్వరూపాయై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః

ఓం సురూపాయై నమః

ఓం ప్రకృత్యై నమః

ఓం కమనీయాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం అవ్యక్తాయై నమః

ఓం సుధ్యత్యై నమః

ఓం కమలాయై నమః

ఓం జగద్దాత్ర్యై నమః

కార్తీక పౌర్ణమి ప్రత్యేకత

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయడం అత్యంత పుణ్యప్రదమైనది. ఈ రోజు ఇలా దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

గమనిక

ఈ వివరాలు పండితుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories