Lunar Eclipse 2026 Today: నేడే చంద్రగ్రహణం.. ఆలయాలన్నీ మూతపడినా.. దర్శనమిచ్చే 5 పుణ్యక్షేత్రాలు ఇవే!

Lunar Eclipse 2026 Today
x

Lunar Eclipse 2026 Today: నేడే చంద్రగ్రహణం.. ఆలయాలన్నీ మూతపడినా.. దర్శనమిచ్చే 5 పుణ్యక్షేత్రాలు ఇవే!

Highlights

Lunar Eclipse 2026 Today: నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం. తిరుమల సహా ప్రధాన ఆలయాలన్నీ మూతపడగా.. గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే 5 విశిష్ట ఆలయాలు ఇవే.

Lunar Eclipse 2026 Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పౌర్ణమి ఘడియల్లో కేతుగ్రస్త చంద్ర గ్రహణం సంభవిస్తోంది. దీని ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం వంటి ప్రముఖ క్షేత్రాల తలుపులు మూసివేశారు. గ్రహణ శాంతి అనంతరం సంప్రోక్షణ చేసి తిరిగి ఆలయాలను తెరుస్తారు. కానీ, మన దేశంలో కొన్ని ఆలయాలకు గ్రహణ దోషం వర్తించదు.

గ్రహణ సమయంలోనూ తెరిచే ఉండే 5 ప్రముఖ ఆలయాలు:

1. శ్రీకాళహస్తి (ఆంధ్రప్రదేశ్)

దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో పరమశివుడు వాయులింగేశ్వరుడిగా వెలిశాడు. ఈ ఆలయానికి గ్రహణ దోషాలు పట్టవు. ఇక్కడ రాహు, కేతువులే శివుడిని అర్చిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే సూర్య, చంద్ర గ్రహణాల సమయంలోనూ ఇక్కడ నిత్య పూజలు, రాహు-కేతు శాంతి పూజలు యధాతథంగా జరుగుతాయి.

2. విష్ణుపాద దేవాలయం - గయ (బీహార్)

పితృదేవతల పిండ ప్రదానానికి అత్యంత పవిత్రమైన క్షేత్రం ఇది. ఇక్కడ విష్ణుమూర్తి పాద ముద్రలు ఉంటాయి. గ్రహణ కాలంలో ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకులకు అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది.

3. మహాకాళేశ్వర దేవాలయం - ఉజ్జయిని (మధ్యప్రదేశ్)

జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతి. గ్రహణ కాలంలోనూ ఇక్కడ భక్తులకు దర్శన అనుమతి ఉంటుంది. కేవలం హారతి, అభిషేక సమయాల్లో స్వల్ప మార్పులు మాత్రమే చేస్తారు.

4. లక్ష్మీనాథ్ దేవాలయం - బికనీర్ (రాజస్థాన్)

ఈ ఆలయంలో ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం గ్రహణ సమయంలో ఆలయం మూసివేయగా, సాక్షాత్తు లక్ష్మీనాథుడు బాలుడి రూపంలో బయటకు వచ్చి ఆకలి తీర్చుకున్నాడట. అప్పటి నుండి స్వామివారికి ఆకలి వేయకూడదని గ్రహణ సమయంలోనూ నైవేద్యం సమర్పిస్తూ, ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.

5. తిరువార్పు కృష్ణ దేవాలయం (కేరళ)

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. గ్రహణ సమయంలో నైవేద్యం పెట్టకపోతే శ్రీకృష్ణుడి విగ్రహం నీరసించిపోతుందని ఇక్కడి అర్చకులు నమ్ముతారు. అందుకే ఎటువంటి గ్రహణం ఉన్నా సరే, ఇక్కడ తలుపులు మూయకుండా స్వామివారికి సేవలు నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories