Magha Purnima 2026: మాఘ పూర్ణిమ 2026.. ఫిబ్రవరి 1న పవిత్ర మాఘీ పౌర్ణమి.. తిథి సమయాలు మరియు పూజా విశిష్టత ఇదే!

Magha Purnima 2026
x

Magha Purnima 2026: మాఘ పూర్ణిమ 2026.. ఫిబ్రవరి 1న పవిత్ర మాఘీ పౌర్ణమి.. తిథి సమయాలు మరియు పూజా విశిష్టత ఇదే!

Highlights

Magha Purnima 2026: మాఘ పూర్ణిమ 2026 ఎప్పుడు? పౌర్ణమి తిథి ప్రారంభం, ముగింపు సమయాలు ఇక్కడ తెలుసుకోండి. మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం, దానధర్మాలు చేయడం వల్ల కలిగే పుణ్యఫలాల పూర్తి వివరాలు.

Magha Purnima 2026: హిందూ సంప్రదాయంలో మాఘ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే మాఘ శుద్ధ పూర్ణిమను 'మాఘీ పూర్ణిమ' లేదా 'మహామాఘి' అని పిలుస్తారు. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ రోజున నదీ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. 2026 సంవత్సరంలో ఈ పవిత్ర పర్వదినం ఎప్పుడు వచ్చింది? శుభ ముహూర్తం ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

మాఘ పూర్ణిమ 2026 తేదీ మరియు సమయం

వేద క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) రోజున జరుపుకోవాలి.

పౌర్ణమి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 1, ఆదివారం తెల్లవారుజామున 05:53 గంటలకు.

పౌర్ణమి తిథి ముగింపు: ఫిబ్రవరి 2, సోమవారం తెల్లవారుజామున 03:39 గంటలకు.

ఉదయ తిథి: ఉదయ తిథి ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీనే ప్రధానంగా పండుగను జరుపుకుంటారు.

మాఘ పౌర్ణమి విశిష్టత - దానధర్మాలు

మాఘ పూర్ణిమ రోజున దేవతలు సైతం భూమిపైకి వచ్చి పవిత్ర నదులలో స్నానమాచరిస్తారని భక్తుల నమ్మకం. ఈ రోజున చేసే స్నానం, దానం విశేష ఫలితాలను ఇస్తాయి:

తిలదానం: నదీ స్నానం కుదరని వారు కనీసం నువ్వులను దానం (తిలదానం) చేయడం వల్ల శుభం కలుగుతుంది.

గురు దోష నివారణ: జాతకంలో గురు దోషం ఉన్నవారు ఈ రోజు నవగ్రహ ఆలయానికి వెళ్లి గురు గ్రహానికి పసుపు వస్త్రంతో పూజించాలి. లేదా ఇంట్లో ఈశాన్య మూలన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.

గౌరీదేవి అనుగ్రహం కోసం..

మాఘ పౌర్ణమి పార్వతీ దేవికి అత్యంత ఇష్టమైన రోజు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా దాంపత్య సమస్యలు ఉన్నవారు ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలి:

పసుపుతో చేసిన గౌరమ్మకు గంధం, కుంకుమ పెట్టి అష్టోత్తరాలతో పూజించాలి.

♦ అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.

♦ గోరింటాకు దానం ఇవ్వడం వల్ల పెళ్లికాని యువతులకు త్వరగా వివాహ యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ సమాచారం మతపరమైన నమ్మకాలు మరియు పురాణాల ఆధారంగా అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. భక్తుల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం అందించడమైనది.

Show Full Article
Print Article
Next Story
More Stories