Mauni Amavasya 2026: మౌనీ అమావాస్య ఎప్పుడు? ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఇవే

Mauni Amavasya 2026: మౌనీ అమావాస్య ఎప్పుడు? ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఇవే
x

Mauni Amavasya 2026: మౌనీ అమావాస్య ఎప్పుడు? ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఇవే

Highlights

Mauni Amavasya : మౌనీ అమావాస్య పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజు.

Mauni Amavasya : మౌనీ అమావాస్య పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజు. ఈ రోజున పూర్వీకుల ప్రీతికోసం చేసే దానధర్మాలు, శ్రాద్ధకర్మలు గొప్ప ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అందుకే చాలామంది ఈ రోజున నదీ స్నానాలు, ప్రత్యేక పూజలు ఆచరిస్తారు.

జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పితృదోషమే కారణమని విశ్వసిస్తారు. ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితంలో కలహాలు, సంతాన సమస్యలు వంటి ఇబ్బందులు పూర్వీకుల దోషాల వల్లనే వస్తాయని పెద్దలు చెబుతారు. మనం పెద్దల నుంచి ఆస్తులను పొందినట్లే, వారు చేసిన కర్మల ప్రభావం కూడా మన జీవితంపై పడుతుందనే నమ్మకం ఉంది. చనిపోయిన పూర్వీకులకు సరైన విధంగా శ్రాద్ధకర్మలు చేయకపోతే పితృదోషాలు ఏర్పడతాయని భావిస్తారు.

ఈ నేపథ్యంలో అమావాస్య ఎంతో ముఖ్యమైనదిగా చెప్పబడుతోంది. అందులోనూ మౌనీ అమావాస్యను అత్యంత శక్తివంతమైన రోజుగా పండితులు పేర్కొంటున్నారు.

2026లో మౌనీ అమావాస్య జనవరి 18వ తేదీ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల మధ్యకాలం పితృదోష నివారణకు శ్రాద్ధకర్మలు, దానధర్మాలకు అత్యంత అనుకూల సమయమని పండితులు సూచిస్తున్నారు.

ఈ రోజున నదీ తీరాల్లో పూర్వీకుల కోసం శ్రాద్ధకర్మలు చేయించుకోవాలి. వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఇతర వస్తువులను పండితులకు దానంగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే కాకులకు, ఆవులకు, శునకాలకు ఆహారం పెట్టడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వాసం.

అమావాస్య రోజున యథాశక్తి అన్నదానం చేయడం చాలా మంచిదని చెబుతారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి పూజలు చేయడం, పూర్వీకుల కోసం శ్రాద్ధకర్మలు నిర్వహించడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని పండితుల అభిప్రాయం. ఈ విధంగా ఆచరిస్తే జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని వారు పేర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories