Vastu Tips for Bedroom: బెడ్‌రూంలో ఈ 7 వస్తువులు ఉంటే అదృష్టం మీ వెంటే.. వాస్తు నిపుణులు సూచిస్తున్న రహస్యాలివే!

Vastu Tips for Bedroom
x

Vastu Tips for Bedroom: బెడ్‌రూంలో ఈ 7 వస్తువులు ఉంటే అదృష్టం మీ వెంటే.. వాస్తు నిపుణులు సూచిస్తున్న రహస్యాలివే!

Highlights

Vastu Tips for Bedroom: మీ బెడ్‌రూంలో ఈ వస్తువులు ఉంటే ఇక మీకు తిరుగుండదు! నెమలి పింఛం నుంచి రాగి చెంబు వరకు.. వాస్తు ప్రకారం బెడ్‌రూంలో ఉండాల్సిన 7 ముఖ్యమైన వస్తువుల జాబితా మరియు వాటి ప్రయోజనాలు.

Vastu Tips for Bedroom: ఇంటి నిర్మాణంలో దిశలు ఎంత ముఖ్యమో, గదిలో మనం ఉంచుకునే వస్తువులు కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మనం ఎక్కువ సమయం గడిపే, విశ్రాంతి తీసుకునే బెడ్‌రూమ్‌లో ప్రతికూల శక్తి (Negative Energy) ఉంటే నిద్రలేమి, ఆందోళన, దంపతుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే బెడ్‌రూంలో సానుకూలతను పెంచే ఈ 7 వస్తువులను ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

1. రాగి చెంబు (Copper Vessel):

రాగికి వ్యతిరేక శక్తిని గ్రహించే గుణం ఉంది. రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీటిని నింపి మీ తల వైపు ఉంచుకోండి. మరుసటి రోజు ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల పీడకలలు రావు మరియు గదిలోని నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

2. నెమలి పింఛం (Peacock Feather):

బెడ్‌రూమ్ టేబుల్‌పై లేదా గోడకు నెమలి పింఛాన్ని ఉంచడం వల్ల రాహు, కేతు దోషాలు తొలగిపోతాయి. ఇది ఆర్థిక కష్టాలను దూరం చేసి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

3. దంపతుల ఫొటో (Couple Photo):

భార్యాభర్తలు కలిసి దిగిన అందమైన ఫొటోను బెడ్‌రూమ్‌లో షోపీస్‌గా పెట్టుకోవాలి. ఇది ఇద్దరి మధ్య ప్రేమానుబంధాన్ని బలపరుస్తుంది, ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగేలా చేస్తుంది.

4. సాల్ట్ ల్యాంప్ (Himalayan Salt Lamp):

సాల్ట్ ల్యాంప్ గదిలోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా, పరిసరాల్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది.

5. రోజ్ క్వార్ట్జ్ జెమ్‌స్టోన్ (Rose Quartz):

దీనిని 'లవ్ స్టోన్' అని పిలుస్తారు. ఈ రాయిని బెడ్‌రూమ్ టేబుల్‌పై ఉంచడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దీనికి క్యాండిల్ లైట్ తోడైతే గది వాతావరణం ఎంతో రొమాంటిక్‌గా మారుతుంది.

6. ఇండోర్ ప్లాంట్స్ (Indoor Plants):

లావెండర్, బాంబూ, స్నేక్ ప్లాంట్ లేదా పీస్ లిల్లీ వంటి మొక్కలను బెడ్‌రూమ్‌లో ఉంచుకోవాలి. ఇవి గదిలోని గాలిని శుభ్రపరచడమే కాకుండా, మానసిక గందరగోళాన్ని తగ్గించి ప్రశాంతతను ఇస్తాయి.

7. కమలం పువ్వు ఆకృతి (Crystal Lotus):

తామరపువ్వు విజయం మరియు ప్రశాంతతకు సూచిక. గాజుతో చేసిన కమలం పువ్వు ఆకృతిని టేబుల్‌పై పెట్టుకోవడం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.

ముఖ్య గమనిక: బెడ్‌రూమ్‌లో అద్దాలు నేరుగా మంచానికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే విరిగిన వస్తువులు, పాత సామాన్లు గదిలో ఉంచకపోవడం శ్రేయస్కరం.

Show Full Article
Print Article
Next Story
More Stories