ధన త్రయోదశి: బంగారం, వెండి కొనడం ఎందుకు మంచిది? కొనలేనివారికి ప్రత్యామ్నాయాలు

ధన త్రయోదశి: బంగారం, వెండి కొనడం ఎందుకు మంచిది? కొనలేనివారికి ప్రత్యామ్నాయాలు
x

ధన త్రయోదశి: బంగారం, వెండి కొనడం ఎందుకు మంచిది? కొనలేనివారికి ప్రత్యామ్నాయాలు

Highlights

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి రోజున హిందువులు ధన త్రయోదశిను జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి రోజున హిందువులు ధన త్రయోదశిను జరుపుకుంటారు. ఉత్తర భారత దేశంలో దీన్ని దంతేరస్గా పిలుస్తారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వస్తోంది. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు పొందడానికి ప్రజలు ప్రత్యేక పూజలు, పరిహారాలు చేస్తారు.

ధన త్రయోదశి ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయంలో దీపావళి పండుగకు ఆరంభం ధన త్రయోదశితోనే జరుగుతుంది. పంచాంగం ప్రకారం ఈ తిథి అత్యంత శుభదాయకమైనదిగా పరిగణించబడుతుంది. ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి భగవాన్ భూమిపై అవతరించిన రోజే ఇది. అందుకే ఈ రోజున బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేయడం శుభసూచకంగా భావిస్తారు.

బంగారం, వెండి ఎందుకు కొనాలి?

బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని నమ్మకం. దీపావళి మొదటి రోజు కావడంతో సంపదకు ఆరంభ సూచికగా కూడా పరిగణిస్తారు.

బంగారం, వెండి కొనలేని వారు అయితే చిన్న చిన్న వస్తువులు కొనడం ద్వారా కూడా శుభఫలితాలు పొందవచ్చని నమ్ముతారు.

బంగారం కొనలేకపోతే ఏం కొనాలి?

ధన త్రయోదశి నాడు కింద చెప్పిన వస్తువులు కూడా శుభప్రదంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి –

చీపురు కట్ట –

ఆ రోజున కొత్త చీపురు కొనుగోలు చేసి ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో దాచిపెట్టాలి. దీని వలన పేదరికం తొలగి సంపద పెరుగుతుందని విశ్వాసం.

గోమతి చక్రం –

లక్ష్మీదేవికి ప్రీతికరమైన గోమతి చక్రాలను కొనుగోలు చేసి పూజా గదిలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, అదృష్టం పెరుగుతుంది.

ఉప్పు –

ధన త్రయోదశి నాడు ఉప్పు కొనుగోలు చేస్తే ఆనందం, శ్రేయస్సు ఇంట్లో స్థిరపడుతుందని నమ్ముతారు.

అదనపు పరిహారం

11 గోమతి చక్రాలను ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. పసుపును కూడా ఇంట్లో ఉంచితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

ఈ ధన త్రయోదశి, బంగారం వెండి మాత్రమే కాదు, మనసులోని భక్తి, విశ్వాసమే నిజమైన సంపదగా పరిగణించబడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories