తిరుపతిలో స్పోర్ట్స్‌ హబ్‌ కోసం 28 ఎకరాల కేటాయింపు

తిరుపతిలో స్పోర్ట్స్‌ హబ్‌ కోసం 28 ఎకరాల కేటాయింపు
x
Highlights

తిరుపతి నగరానికి జాతీయ స్థాయి క్రీడా మౌలిక వసతుల ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. తిరుపతిలో స్పోర్ట్స్‌ హబ్‌ నిర్మాణం కోసం 28 ఎకరాల భూమిని దామినీడు వద్ద కేటాయించారు.

అమరావతి: తిరుపతి నగరానికి జాతీయ స్థాయి క్రీడా మౌలిక వసతుల ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. తిరుపతిలో స్పోర్ట్స్‌ హబ్‌ నిర్మాణం కోసం 28 ఎకరాల భూమిని దామినీడు వద్ద కేటాయించారు. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతిలో క్రీడా హబ్ ఏర్పాటు కొరకు గతంలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేయడంతో పాటు, పలుమార్లు ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు రవి నాయుడు తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు నారా లోకేష్, అనగాని సత్య ప్రసాద్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ప్రతిపాదనలు తీసుకెళ్లారు. క్యాబినెట్ సమావేశంలో తిరుపతి దామినేడు వద్ద స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో “క్రీడాంధ్రప్రదేశ్” రూపకల్పనలో ఈ నిర్ణయం ఒక కీలక మైలురాయి కానుందన్నారు. తిరుపతి క్రీడా హబ్‌గా అభివృద్ధి చెందేందుకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశానికి ప్రధాన క్రీడా కేంద్రంగా అవతరించనున్నదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిని స్పోర్ట్స్ కేంద్రంగా మారుస్తామని చెప్పారు. అతి త్వరలోనే స్పోర్ట్స్ సిటీని నిర్మించడానికి శ్రీకారం చుడతామన్నారు. స్పోర్ట్స్ అథారిటీకి భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వానికి, అధికారులకు శాప్ చైర్మన్ రవి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories