మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాల పంట

4th Gold for India At Womens World Boxing Championship
x

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాల పంట

Highlights

* భారత్ ఖాతాలో చేరిన 4 స్వర్ణాలు

Womens Boxing Championship: మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో భారత్ మొత్తం 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. తమ పంచ్‌లతో ప్రత్యర్ధులకు భారత బాక్సర్లు చుక్కలు చూపారు. నీతూ గంగాస్, స్వీటి, జరీనా బంగారు పతకాలు సాధించగా... తాజాగా 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్‌ స్వర్ణాన్ని ముద్దాడింది. 75 కిలోల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్‌కు పసిడి పతకం లభించింది. ఆస్ట్రేలియా బాక్సర్ పార్కర్‌పై లవ్లీనా 5-2తో విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన లవ్లీనా ప్రపంచ చాంపియన్‌షిప్‌ సాధించడం ఇదే తొలిసారి. 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించింది. ఫైనల్‌లో 5-0 తేడాతో వియత్నాంకు చెందిన గుయెన్ టాన్‌పై నిఖత్ గెలుపొందింది. ప్రపంచ బ్యాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ గెలుచుకున్న భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories