Akash Kumar Choudhary: ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘాలయ బ్యాటర్‌ ఆకాశ్ చౌదరి.. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ

Akash Kumar Choudhary
x

Akash Kumar Choudhary: ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘాలయ బ్యాటర్‌ ఆకాశ్ చౌదరి.. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ

Highlights

Akash Kumar Choudhary:

Akash Kumar Choudhary: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో మేఘాలయ రాష్ట్ర క్రికెటర్ ఆకాశ్ కుమార్ చౌదరి సంచలనం సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ (Fastest Half Century) నమోదు చేయడంతో పాటు, తన ఇన్నింగ్స్‌లో వరుసగా 8 సిక్స్‌లు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌ మ్యాచ్‌లో ఈ అద్భుత రికార్డు నమోదైంది.



11 బంతుల్లోనే 50.. బద్దలైన వైట్ రికార్డ్

గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల మేఘాలయ బ్యాటర్‌ ఆకాశ్ కుమార్ చౌదరి కేవలం 11 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

దీంతో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఆకాశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

♦ ఇంతకుముందు లీసెస్టర్‌షైర్ ఆటగాడు వేన్ వైట్ 2012లో 12 బంతుల్లో ఈ ఫీట్ సాధించిన రికార్డును ఆకాశ్ చౌదరి బద్దలు కొట్టాడు.

♦ ఈ మ్యాచ్‌లో ఆకాశ్‌ చౌదరి 14 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఒకే ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టడం విశేషం. మొత్తంగా తన బ్యాటింగ్‌లో వరుసగా 8 బంతుల్లో 8 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు.

♦ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ జట్టు 6 వికెట్ల నష్టానికి 628 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు

ఆకాశ్ చౌదరి నమోదు చేసిన కొత్త ప్రపంచ రికార్డుతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాళ్ల జాబితా:


బంతులుఆటగాడుజట్టు (వర్సెస్)సంవత్సరం
11ఆకాశ్ కుమార్ చౌదరిమేఘాలయ (అరుణాచల్ ప్రదేశ్‌)2025
12వేన్ వైట్లీసెస్టర్‌షైర్ (ఎసెక్స్‌)2012
13మైకేల్ వాన్ఈస్టర్న్‌ ప్రావిన్స్ బి (గ్రిక్వాలాండ్ వెస్ట్‌)1984/85
14నెడ్ ఎకెర్స్లీలీసెస్టర్‌షైర్ (ఎసెక్స్‌)2012
15ఖలీద్ మహమూద్గుజ్రన్‌వాలా (సర్గోధా)2000/01
15బందీప్ సింగ్జమ్మూ & కశ్మీర్ (త్రిపుర)2015/16


Show Full Article
Print Article
Next Story
More Stories