కిడాంబి శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్‌

AP CM Jagan Felicitates: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను అభినందించారు సీఎం జగన్.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 8:45 PM IST
AP CM Jagan Felicitates Shuttler Kidambi Srikanth, Deaflympics Tennis Player Sheikh Jafreen
X

కిడాంబి శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్‌

AP CM Jagan Felicitates: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను అభినందించారు సీఎం జగన్. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రశంసించారు. బదిరుల ఒలంపిక్‌ క్రీడల్లో కాంస్య పదకం సాధించిన కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తి చాటడంపై జాఫ్రిన్‌ను ప్రశంసించారు. షేక్‌ జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story