Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి.. తనయుడు అర్జున్ పెళ్లి ఖరారు!

Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి.. తనయుడు అర్జున్ పెళ్లి ఖరారు!
x

Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి.. తనయుడు అర్జున్ పెళ్లి ఖరారు!

Highlights

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం 2026 మార్చిలో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం 2026 మార్చిలో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముంబైకి చెందిన సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఇప్పటికే 2025 ఆగస్టులో అర్జున్–సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఇరు కుటుంబాలు ప్రైవేట్‌గా వేడుకలు జరుపుకుంటూ వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఇరు కుటుంబాల చర్చల అనంతరం పెళ్లి తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లి ఎప్పుడు?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 3 నుంచి వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని, మార్చి 5న అర్జున్ టెండూల్కర్–సానియా చందోక్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలు ముంబైలోనే జరగనున్నాయని సమాచారం. సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని టాక్. ఈ విషయంపై సచిన్ టెండూల్కర్ కుటుంబాన్ని మీడియా సంప్రదించినప్పటికీ అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.

సానియా చందోక్ ఎవరు?

సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. గ్రావిస్ గ్రూప్ అధినేత అయిన రవి ఘాయ్ హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీల్లో ప్రముఖ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ, మెరైన్ డ్రైవ్ వంటి సంస్థలు ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నాయి.

అర్జున్ టెండూల్కర్ కెరీర్

అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన అర్జున్ 2022లో గోవా తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది తండ్రి సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయడం విశేషం.

ఇప్పటివరకు అర్జున్ 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 620 పరుగులు, 48 వికెట్లు సాధించాడు. లిస్ట్-ఏలో 23 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు, టీ20ల్లో 29 మ్యాచ్‌లు, ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడాడు.

సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి వార్తతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories