Arshdeep Singh History: మరో 4 వికెట్లే.. టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్‌ సింగ్ చరిత్ర!

Arshdeep Singh History
x

Arshdeep Singh History: మరో 4 వికెట్లే.. టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్‌ సింగ్ చరిత్ర!

Highlights

Arshdeep Singh History: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్స్ తీస్తే.. టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు.

Arshdeep Singh History: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్స్ తీస్తే.. టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలుస్తాడు. టీ20 వరల్డ్‌కప్‌ 206లో భాగంగా ఢిల్లీ వేదికగా నమీబియాతో జరగనున్న మ్యాచ్‌లో ఈ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశముంది. అర్ష్‌దీప్ ప్రస్తుతం మంచి ఫామ్ మీదున్నాడు. నమీబియాపై కాకపోయినా.. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లలో అయినా సాధించడం పక్కా. చూడాలి మరి స్వింగ్ బాస్ ఏ మ్యాచ్‌ ఈ రేర్ రికార్డు అందుకుంటాడో.

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అశ్విన్ 24 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ మాత్రం కేవలం 15 మ్యాచ్‌ల్లోనే 29 వికెట్లు సాధించి.. ఇప్పటికే యాష్ రికార్డు దరిదాపుల్లోకి వచ్చాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (26), హార్దిక్ పాండ్యా (24), రవీంద్ర జడేజా (22)లు టాప్ 5లో ఉన్నారు. వీరిలో అర్ష్‌దీప్ తక్కువ మ్యాచ్‌ల్లోనే ఎక్కువ వికెట్లు సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం. అతడి బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 4/9 కాగా.. అశ్విన్‌ది 4/11.

ఇటీవలి కాలంలో అర్ష్‌దీప్ సింగ్ ఫామ్ అద్భుతంగా ఉంది. అమెరికాతో జరిగిన గత మ్యాచ్‌లో భారత బౌలింగ్ దాడికి అతడే నేతృత్వం వహించాడు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయాల్లో కూడా అర్ష్‌దీప్ భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అతడు 76 మ్యాచ్‌ల్లో 118 వికెట్లు సాధించి టాప్‌లో ఉన్నాడు. ప్రపంచ స్థాయిలో చూస్తే టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్ల రికార్డు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ పేరిట ఉంది. షకీబ్ పేరిట 50 వికెట్లు ఉన్నాయి. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంపా చెరో 40 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

అర్ష్‌దీప్‌ సింగ్‌ జులై 2022లో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. మొదటి టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో 2022 ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తోపై ఆడాడు. ఆ మ్యాచ్‌లో 32 పరుగులిచ్చి.. 4వికెట్లు తపడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 17 వికెట్లు తీశాడు. భారత్ టీ20 వరల్డ్‌ కప్‌ సాధించడంలో అతడి పాత్ర కీలకం. నేటి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ నాలుగు వికెట్లు పడగొడతాడా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అతడు ఈ ఘనత సాధిస్తే టీమిండియా క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories