AUS vs IND: పింక్ బాల్ టీమిండియాను బోల్తా కొట్టించింది

Australia Beat India In Adelaide Test
x

AUS vs IND: పింక్ బాల్ టీమిండియాను బోల్తా కొట్టించింది

Highlights

AUS vs IND: ఫస్ట్ టెస్ట్‌లో గెలిచాం.. రెండో టెస్ట్‌లోనూ గెలిస్తే సిరీస్‌పై పట్టు బిగించొచ్చు అనుకున్నాం.. కానీ. అంచనాలు తప్పాయి. పింక్ బాల్ టీమిండియాను బోల్తా కొట్టించింది.

AUS vs IND: ఫస్ట్ టెస్ట్‌లో గెలిచాం.. రెండో టెస్ట్‌లోనూ గెలిస్తే సిరీస్‌పై పట్టు బిగించొచ్చు అనుకున్నాం.. కానీ. అంచనాలు తప్పాయి. పింక్ బాల్ టీమిండియాను బోల్తా కొట్టించింది. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. పెర్త్‌ టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో గెలిచింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్‌ 336 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 175 పరుగులే చేయగలిగింది. కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ వికెట్టేమీ నష్టపోకుండా 3.2 ఓవర్లలోనే విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ట్రావిస్‌ హెడ్ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వచ్చింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌ వేదికగా ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories