Babar Azam: సిగ్గుచేటు, అవమానకరం.. బాబర్ అజామ్ షాకింగ్ కామెంట్స్!

Babar Azam: సిగ్గుచేటు, అవమానకరం.. బాబర్ అజామ్ షాకింగ్ కామెంట్స్!
x
Highlights

Babar Azam: టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్–పాకిస్థాన్ జట్ల మ్యాచ్ జరిగింది.

Babar Azam: టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్–పాకిస్థాన్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని అందరూ అనుకున్నా.. అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. మ్యాచ్ మొదటి ఓవర్ తప్ప.. మిగతా ఆధిపత్యం మొత్తం టీమిండియాదే. మ్యాచ్‌లో ముందుగా బౌటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. ఛేదనలో పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితంపై పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఓటమి తమ జట్టుకు సిగ్గుచేటు, అవమానకరం అని పేర్కొన్నాడు. పేలవ ప్రదర్శనపై పాక్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

మ్యాచ్ అనంతరం బాబర్ అజామ్ మాట్లాడుతూ... 'భారత్ చేతిలో ఎదురైన ఓటమికి తీవ్ర నిరాశగా ఉంది. ఈ పరాజయం మాకు సిగ్గుచేటు. బ్యాటింగ్ యూనిట్‌గా మేము మంచి ప్రదర్శన చేయలేకపోయాము. నేను తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం బాధగా ఉంది. కీలక మ్యాచ్‌లో జట్టు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పులను గుర్తించి.. సరిదిద్దుకోవాలి. తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాము. ప్రస్తుతం మా పూర్తి దృష్టి నమీబియాతో జరగబోయే మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్ గెలిచి సూపర్ 8 దశకు అర్హత సాదించాలి. ఇదే ఇప్పుడు మా టార్గెట్. మేము ఇక్కడకు వచ్చింది కేవలం ఆడేందుకు కాదు, ట్రోఫీ గెలవడానికే. వరల్డ్‌కప్‌ను గెలిచి పాకిస్థాన్ ప్రజలను గర్వపడేలా చేయాలనే సంకల్పంతో ఉన్నాం' అని చెప్పాడు.

టీ20 వరల్డ్‌కప్ 2026లో ముందున్న మ్యాచ్‌లు తమకు కీలకమని, జట్టు మొత్తం కలిసికట్టుగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని బాబర్ ఆజామ్ పేర్కొన్నాడు.టీమిండియా మ్యాచ్‌లో బాబర్ నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో మూడు ఇన్నింగ్స్‌లలో బాబర్ 66 పరుగులు మాత్రమే చేశాడు. నెదర్లాండ్స్‌పై 15 పరుగులు, అమెరికాపై 46 రన్స్ చేసిన బాబర్.. భారత్‌తోపై 5 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో పాక్ మాజీలు అతడిపై మండిపడుతున్నారు. ఎన్నో ప్రపంచ కప్లు ఆడిన అనుభవం ఉన్న బాబర్.. కీలక భారత్‌తో మ్యాచ్ అనగానే ఒత్తిడికి లోనవుతున్నాడు. భారత్‌పై ఇప్పటివరకు అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories