
Babar Azam: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే చెత్త రికార్డు.. ఇక పాక్ జట్టులో బాబర్ ఆజమ్ కష్టమే?
వరుస వైఫల్యాలతో విమర్శల మోత.. కెప్టెన్సీ, ప్లేయింగ్ XI పై పెద్ద ప్రశ్నలు తెరపైకి!
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇటీవల టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఒకప్పుడు నిలకడకు మారుపేరుగా నిలిచిన బాబర్ బ్యాటింగ్.. గత మూడు ఎడిషన్‌లలో దారుణంగా ఉంది. ఈ మాటలు అంటుంది ఫాన్స్, మాజీలు కాదు.. గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో బాబర్ స్లో ఇన్నింగ్స్‌లు పాకిస్థాన్ జట్టుపై ఒత్తిడి పెంచుతున్నాయని విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్‌కప్ 2026లో బాబర్ ఆజమ్ ప్రదర్శన దారుణంగా ఉంది. నెదర్లాండ్స్ 15(18), అమెరికా 46(32), భారత్ 5(7), ఇంగ్లాండ్ 25(24)పై గొప్పగా ఏమీ పరుగులు చేయలేదు. ఈ గణాంకాలు బాబర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 2022 టోర్నీలో కూడా ప్రారంభ మ్యాచ్‌ల్లో దారుణ ప్రదర్శన చేశాడు. భారత్‌పై డక్ అవుట్ కాగా.. జింబాబ్వేపై 4, నెదర్లాండ్స్‌పై 4, దక్షిణాఫ్రికాపై 6 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై 25, న్యూజిలాండ్‌పై 53, ఇంగ్లాండ్‌పై 32 పరుగులు చేసి కొంతమేర ఫామ్ అందుకున్నా.. మొత్తం టోర్నీ పరంగా స్థిరత్వం చూపలేదు.
2024 ఎడిషన్‌లో కూడా బాబర్ ఆజమ్ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అమెరికాపై 44(42) స్లో ఇన్నింగ్స్, భారత్‌పై 13, కెనడాపై 33, ఐర్లాండ్‌పై 32 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉండనే ప్రధాన విమర్శ ఉంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలలో స్ట్రైక్‌రేట్ కీలకం. అయితే ఆశ్చర్యకరంగా అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా గుర్తింపు పొందిన బాబర్.. టీ20 వరల్డ్‌కప్‌లలో మాత్రం తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్లలో అతి తక్కువ స్ట్రైక్‌రేట్ గల బ్యాటర్ల జాబితాలో బాబర్ (11.5) మొదటి స్థానంలో ఉండడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా చూస్తే.. గత మూడు టీ20 వరల్డ్‌కప్‌లలో బాబర్ ఆజమ్ నుంచి ఆశించిన స్థాయి ప్రదర్శన రాలేదు. ఒక స్టార్ ప్లేయర్‌గా అతను కీలక మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు చేయాలని, ఒత్తిడిలో రన్స్ చేయడం లేదని ఫాన్స్, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత టోర్నీలో విఫలమవడంతో అతడిపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇక పాక్ జట్టులో బాబర్ స్థానం కష్టమే అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో బాబర్ ఆడడం కష్టమే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




