U19 T20 WC: టీమిండియాకు బీసీసీఐ బంపర్ ప్రైజ్.. కలలో కూడా ఊహించి ఉండరు

U19 T20 WC: టీమిండియాకు బీసీసీఐ బంపర్ ప్రైజ్.. కలలో కూడా ఊహించి ఉండరు
x

U19 T20 WC: టీం ఇండియాకు బీసీసీఐ బంపర్ ప్రైజ్.. కలలో కూడా ఊహించి ఉండరు

Highlights

U19 T20 WC: భారత అండర్-19 మహిళా జట్టు 2025 T20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది.

U19 T20 WC: భారత అండర్-19 మహిళా జట్టు 2025 T20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఈ ఘనత భారత క్రికెట్‌కు మరో మైలురాయిగా నిలిచింది. కేవలం 7 నెలల క్రితమే రోహిత్ శర్మ నేతృత్వంలోని పురుషుల జట్టు 2024 T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అండర్-19 టీమ్‌కి భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఓటమి అనే మాటే లేకుండా, ప్రతీ మ్యాచ్‌లో గెలిచింది. ఈ గెలుపును పురస్కరించుకొని బీసీసీఐ మొత్తం రూ.5 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.

బీసీసీఐ నుంచి రూ.5 కోట్ల ప్రైజ్ మనీ

BCCI తన అధికారిక ప్రకటనలో.. "భారత అండర్-19 మహిళా జట్టు వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ గెలిచినందుకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుత విజయాన్ని గౌరవిస్తూ, టీమ్ మరియు సహాయక సిబ్బందికి మొత్తం రూ.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేయాలని బీసీసీఐ నిర్ణయించింది." అని పేర్కొంది.

అప్రతిహతంగా దూసుకెళ్లిన టీమ్ ఇండియా

ఈ టోర్నమెంట్‌లో భారత అండర్-19 టీమ్ తనదైన హవా కొనసాగించింది. గ్రూప్-ఏలో శ్రీలంక, వెస్టిండీస్, మలేషియాలను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. సూపర్-6 దశలోనూ తన నాలుగు మ్యాచ్‌లను గెలిచి టాప్‌లో నిలిచింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించగా, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అదే తరహాలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వరుసగా రెండోసారి ఛాంపియన్‌షిప్ కైవసం

అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ తొలిసారి 2023లో నిర్వహించగా, అప్పట్లో కూడా భారత జట్టే విజేతగా నిలిచింది. ఇప్పుడు 2025లో మరోసారి టైటిల్ కైవసం చేసుకొని, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత యువ క్రికెటర్ల ప్రతిభను మరోసారి ప్రపంచం మొత్తం గుర్తించింది. ఈ ఘనతను పురస్కరించుకొని, భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు మరింత బలపడుతుందనే నమ్మకంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. భారత మహిళా క్రికెట్‌కు ఇది చారిత్రక విజయమనే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories