Tokyo Olympics 2021: పతకానికి అడుగు దూరంలో బాక్సర్ పూజారాణి

Tokyo Olympics 2021: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన బాక్సర్ పూజారాణి * ఆల్జీరియా బాక్సర్‌ చైబ్‌పై 5-0తేడాతో విజయం

Sandeep Eggoju
Updated on: 28 July 2021 5:48 PM IST
Boxer Pooja Rani Reached to Quarter Final in Tokyo Olympics 2021
X
క్వాటర్ ఫైనల్ కు చేరిన బాక్సర్ పూజ రాణి (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics 2021 - Boxer Pooja Rani: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఒలింపిక్స్ 69-74 కేజీల విభాగంలో ఇండియ‌న్ బాక్సర్ పూజా రాణి క్వార్టర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 16 బౌట్‌లో పూజా రాణి అల్జీరియా బాక్సర్ చైబ్‌పై 5-0 తేడాతో గెలిచింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జ‌డ్జ్‌లు పూజానే ఏక‌గ్రీవంగా విజేత‌గా తేల్చడం విశేషం. త‌న ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌ల‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన పూజా రాణి మ‌రో ఒక్క మ్యాచ్‌లో గెలిచినా భారత్‌కు ప‌త‌కం ఖాయ‌మ‌వుతుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju