IPL 2025: ఐపీఎల్ 2025లో ఆటగాళ్ల రీప్లేస్ మెంట్ రూల్స్ ఛేంజ్

IPL 2025: ఐపీఎల్ 2025లో ఆటగాళ్ల రీప్లేస్ మెంట్ రూల్స్ ఛేంజ్
x

IPL 2025: ఐపీఎల్ 2025లో ఆటగాళ్ల రీప్లేస్ మెంట్ రూల్స్ ఛేంజ్ 

Highlights

IPL 2025: ఐపీఎల్ 2025 కి కౌంట్‌డౌన్ షురూ అయింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.

IPL 2025: ఐపీఎల్ 2025 కి కౌంట్‌డౌన్ షురూ అయింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఇటీవల గాయపడిన స్టార్ ఆటగాడు లిజాద్ విలియమ్స్ స్థానంలో కార్బిన్ బాష్ ను జట్టులోకి తీసుకుంది . దీని కోసం, కార్బిన్ బాష్ పీఎస్ఎల్ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. దీంతో పాకిస్తాన్ బోర్డు అతడి మీద లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇది నిబంధనల ఉల్లంఘటన అని బోర్డు పేర్కొంది. ఇప్పుడు ఐపీఎల్ లో గాయపడిన ఆటగాళ్లను భర్తీ చేయడానికి సంబంధించిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. జట్లు తమ ఆటగాళ్లను ఎప్పుడు, ఏ పరిస్థితులలో మార్చుకోవచ్చు. వారి ఫీజుల నియమాలు, షరతులు ఏంటో చూద్దాం.

ఐపీఎల్ 2025 లో గాయపడిన ఆటగాళ్ల భర్తీ నియమాలలోని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నియమాన్ని జట్లు ఎప్పుడు సద్వినియోగం చేసుకోవచ్చు. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఇతర ఆటగాళ్లను తమ జట్టులో ఎప్పుడు చేర్చుకోవచ్చో తెలుసుకుందాం.

ఐపీఎల్ జట్లు ఇప్పుడు వారి 12వ లీగ్ మ్యాచ్ వరకు గాయపడిన ఆటగాళ్లను భర్తీ చేయవచ్చు. గతంలో ఇది 7 మ్యాచ్‌లకే పరిమితం చేశారు. కానీ ఈ సారి దానిని పెంచారు. ఆ సీజన్ కోసం రిజిస్టర్డ్ అందుబాటులో ఉన్న ప్లేయర్ పూల్‌లో యాడ్ చేసిన వ్యక్తిని చేర్చుకోవచ్చు. అతని లీగ్ ఫీజు అతను జట్టులో భర్తీ చేసే ఆటగాడి కంటే ఎక్కువగా ఉండకూడదు.

ప్రస్తుత సీజన్‌లో జట్టు ఫీజు పరిమితిలో భర్తీ ఆటగాళ్ల లీగ్ ఫీజులు లెక్కించరు. భర్తీ చేసిన ఆటగాడి ఒప్పందాన్ని తదుపరి సీజన్ వరకు పొడిగిస్తే, అతని ఫీజు ఫీజు పరిమితికి వ్యతిరేకంగా లెక్కిస్తారు. ఆటగాడి గాయం లేదా అనారోగ్యం జట్టు 12వ లీగ్ మ్యాచ్ సమయంలో లేదా అంతకు ముందు జరిగి ఉండాలి.

సీజన్ ముగిసే వరకు ఆటగాడు గాయం నుండి కోలుకోలేడని BCCI ఏర్పాటు చేసిన వైద్యుడు నిర్ధారించాల్సి ఉంటుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాడు ఈ సీజన్‌లో తదుపరి మ్యాచ్‌లు ఆడలేడు. ఆటగాళ్లను మార్చిన తర్వాత కూడా, జట్టులోని గరిష్ట ఆటగాళ్ల సంఖ్య 25 కంటే ఎక్కువగా ఉండకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories