CSK-IPL 2026: సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు?.. అశ్విన్, రైనా ఇన్!

CSK-IPL 2026: సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు?.. అశ్విన్, రైనా ఇన్!
x

CSK-IPL 2026: సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు?.. అశ్విన్, రైనా ఇన్!

Highlights

CSK-IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఫ్రాంచైజీకి లెజెండ్స్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్, సురేశ్ రైనాలు సీఎస్‌కే కోచింగ్ సెటప్‌లో భాగమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి అశ్విన్‌ను సీఎస్‌కే బౌలింగ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉందట. అశ్విన్‌కు ఉన్న అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ యువ బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోందని టాక్. ముఖ్యంగా స్పిన్ విభాగంలో సీఎస్‌కేకి కొత్త శక్తిని అందించేలా అశ్విన్ పాత్ర ఉండనుందని సమాచారం. ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా కూడా కోచింగ్ సెటప్‌లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైనాను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉందట. రైనా ఎనర్జీ, ఫీల్డింగ్ స్టాండర్డ్స్, యువ ఆటగాళ్లతో కలిసిపోయే స్వభావం సీఎస్‌కేకి ప్లస్ అవుతుందని ఫ్రాంచైజీ భావిస్తోందని సమాచారం.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా భవిష్యత్తులో మేనేజ్‌మెంట్ పాత్రలో కనిపించనున్నాడట. ఐపీఎల్ 2027 నుంచి ధోనీ టీమ్‌కు కన్సల్టెంట్‌గా సేవలందించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఆటగాడిగా మైదానంలో మ్యాజిక్ చేసిన ధోనీ.. వ్యూహాత్మకంగా కూడా జట్టుకు మార్గదర్శకుడిగా నిలవనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుత హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం తన పదవిలో కొనసాగనున్నాడు. సీఎస్‌కేవిజయాల్లో కీలక పాత్ర పోషించిన ఫ్లెమింగ్ అనుభవం, కొత్తగా చేరే అశ్విన్–రైనా ఐడియాలు కలిస్తే.. రాబోయే సీజన్లలో చెన్నై మరింత బలమైన జట్టుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తానికి ఐపీఎల్ 2026 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కోచింగ్ సెటప్‌లో లెజెండ్స్ ఎంట్రీతో ఆ ఫ్రాంచైజీ కొత్త యుగానికి సిద్ధమవుతోందని చెప్పొచ్చు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం ఐపీఎల్ 2026 ఆరంభం కానుంది. మార్చి చివరలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఐపీఎల్ 2025లో నిరాశపరిచిన చెన్నై.. ఈసారి సత్తాచాటాలని చూస్తోంది. అందుకు అందుకు అనుగుణంగానే వేలంలో మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories