
టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాక్ ఓడిపోయిన తరువాత నెట్టింట్లో చాలా పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు పాక్ పై వేసిన సెటైర్ నవ్విస్తోంది
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అందరిలోనూ ఒకరకమైన ఉత్కంఠ. క్రికెట్ అభిమానులే కాదు.. రెండు దేశాల సాధారణ ప్రజలు కూడా అదో యుద్ధంలా భావిస్తారంటే డౌట్ అక్కర్లేదు. ఇతర దేశాల క్రికెట్ అభిమానులు కూడా ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే ఉత్సుకతను ఆపుకోలేరు. అలాంటిది టీ20 ప్రపంచ కప్ పోటీల్లో రెండు జట్లు తలపెడితే పరిస్థితి మామూలుగా ఉండదుగా.. అదే జరిగింది ఆదివారం నాడు. భారత్-పాకిస్థాన్ మధ్య కొలొంబోలో మ్యాచ్ జరిగింది. టీమిండియా పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. దీంతో మ్యాచ్ ఫలితంపై అందరూ విపరీతమైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. పాకిస్థాన్ ఓటమిపై తలొకరకంగా వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.
సచిన్ టెండూల్కర్ “తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ శక్తివంతమైన బ్యాటింగ్ జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ఖచ్చితమైన క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ మ్యాచ్‌పై పట్టును బిగించింది. జట్టు ప్రారంభం నుండి డ్రైవింగ్ సీటులో కనిపించింది. చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించింది. అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఈరోజు మ్యాచ్‌ను పూర్తిగా కుదిపేసింది." అంటూ స్పందించారు
భారత్ - పాకిస్థాన్ ల మధ్య కాగితంపై ఎంత తేడా కనిపించినా, మానసిక ఒత్తిడి ఎల్లప్పుడూ నిజమైన పరీక్ష. కాబట్టి, నీలిరంగు పురుషులకు సెల్యూట్. మీరు మైదానంలో మాత్రమే కాదు, మీ ధైర్యంతో మా హృదయాలను కూడా గెలిచారు అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు .
ఇలా చాలామంది తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ భారత్ ను అభినందించారు. అయితే, ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ ఓటమిని హైలైట్ చేస్తూ తమదైన స్టైల్ లో ఒక పోస్టర్ X లో పోస్ట్ చేశారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ సైన్ బోర్డులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. ఇదిగో ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ ఓటమిని ట్రాఫిక్ రూల్స్ తో ముడిపెట్టి పంచ్ డైలాగ్ వేశారు. "మీరు తప్పు ప్రదేశంలో యు-టర్న్ తీసుకుంటే, మీరు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు " అనే కొటేషన్ తో పాకిస్థాన్ ప్లేయర్స్ ఫోటోను పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని భీష్మించి.. చివరకు ఐసీసీ ఒత్తిడితో అర్ధం లేని షరతులను పెట్టి.. వాటిలోనూ సింహభాగం ఐసీసీ పక్కకు పెట్టేసినా సరే యూ టర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకుని భారత్ తో తలపడిన విషయం తెలిసిందే. దీనినే ఢిల్లీ పోలీసులు హైలైట్ చేశారు.
నిజమే కదా.. యు టర్న్ ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ప్రమాదం తప్పదు. ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో అదే జరిగింది. అనవసరంగా యూ టర్న్ తీసుకుని భారత్ తో తలపడ్డామే అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాక్ అభిమానులు కచ్చితంగా తలలు పట్టుకునే ఉంటారు.. కదా!

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




