Cricket Records : ఇండియా రికార్డ్ బద్దలు.. టీ20Iలలో 300 పరుగులు

Cricket Records
x

Cricket Records : ఇండియా రికార్డ్ బద్దలు.. టీ20Iలలో 300 పరుగులు

Highlights

Cricket Records: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటిన తొలి పూర్తిస్థాయి జట్టుగా నిలిచింది.

Cricket Records: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటిన తొలి పూర్తిస్థాయి జట్టుగా నిలిచింది. సెప్టెంబర్ 12, 2025న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టింది.

సాల్ట్-బట్లర్ జోడీ అద్భుతం

ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు తమ సత్తా చాటారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ కేవలం 7.5 ఓవర్లలోనే 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం తర్వాత 300 పరుగుల రికార్డు సాధ్యమేనా అనే చర్చ మొదలైంది.

సాల్ట్ మెరుపు సెంచరీ..

ఫిలిప్ సాల్ట్ కేవలం 39 బంతుల్లోనే మెరుపు సెంచరీ చేసి ఇంగ్లండ్ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు. అతను కేవలం 60 బంతుల్లో 141 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇది ఇంగ్లండ్ తరపున టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు కూడా సాల్ట్ పేరిటే ఉంది (119 పరుగులు). ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ సింగిల్ తీసి 300 పరుగుల మార్క్‌ను దాటించాడు.

రికార్డుల మీద రికార్డులు

అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇది మూడవసారి 300+ స్కోర్ నమోదైంది. గతంలో నేపాల్ 314 పరుగులు (మంగోలియాపై), జింబాబ్వే 344 పరుగులు (గాంబియాపై) చేశాయి. అయితే, ఫుల్ మెంబర్ జట్ల మధ్య ఈ స్కోరు నమోదు కావడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఫుల్ మెంబర్ జట్ల మధ్య అత్యధిక స్కోర్ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. ఇండియా 2024లో బంగ్లాదేశ్‌పై 297 పరుగులు చేసింది. ఇప్పుడు ఇంగ్లండ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లు 30 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టారు. అంటే మొత్తం 48 బౌండరీలు. ఫుల్ మెంబర్ జట్ల మధ్య ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు ఇది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ క్రికెట్ ప్రపంచంలో మరోసారి తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories