ఇంగ్లండ్ vs భారత్: లార్డ్స్ టెస్ట్‌లో పోరాడి ఓడిన టీమిండియా

ఇంగ్లండ్ vs భారత్: లార్డ్స్ టెస్ట్‌లో పోరాడి ఓడిన టీమిండియా
x

ఇంగ్లండ్ vs భారత్: లార్డ్స్ టెస్ట్‌లో పోరాడి ఓడిన టీమిండియా

Highlights

లార్డ్స్ టెస్ట్‌లో భారత్‌కు నిరాశ: 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకు ఆలౌట్… జడేజా (61*) పోరాడినా విజయం దక్కలేదు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి.

ప్రముఖ లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో భారత్ తక్కువ పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. 193 పరుగుల విజయలక్ష్యంతో చివరి రోజు 58/4 స్కోరుతో ఆరంభించిన గిల్ సేన, 170 పరుగులకే ఆలౌట్ అయింది.

రవీంద్ర జడేజా (నాటౌట్ 61; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిగా పోరాడాడు. కెఎల్ రాహుల్ 39 పరుగులతో సహాయపడ్డాడు. అయితే మిగిలిన బ్యాటర్లు నిరాశ పరిచారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మరియు బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, బ్రైడన్ కార్స్‌కు రెండు వికెట్లు లభించాయి. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఈ విజయంలోతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories