
Gautam Adani
Gautam Adani: టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియాపై గౌతమ్ అదానీ అభినందనల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Gautam Adani: టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నటించిన ఒక ప్రకటన కనిపించింది. అందులో, "టీం ఇండియా చరిత్రను పునరావృతం చేస్తుంది.. టీం ఇండియా చరిత్రను కూడా ఓడిస్తుంది" అని రోహిత్ చెబుతూ ఉంటాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8న జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి చరిత్రను పునరావృతం చేసి చరిత్రను ఓడించింది.
ఈ అద్భుతమైన విజయానికి టీమిండియాకు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా టీమిండియాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీతో సహా చాలా మంది నేతలు భారత్ విజయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కూడా టీమిండియాను అభినందిస్తూ తన x ఎకౌంట్ లో పోస్ట్ పెట్టారు. అన్ బిలీవబుల్.. అన్ స్టాపబుల్.. అన్ బీటెన్ భారత్ అంటూ అదానీ ప్రశంసలతో ముంచేశారు. అంతేకాదు.. న్యూజిలాండ్ లెక్కలు తేల్చేశారు అంటూ రాసిన ఆయన సంజూ సామ్సన్, బుమ్రాలను ప్రత్యేకంగా అభినందించారు.
సంజూ సామ్సన్ 97, 89, 89 స్కోరులు ప్రస్తావిస్తూ వాటిని తమ విజింజం (Vizhinjam) పోర్టులో క్రేన్ కూడా ఇంత కంటిస్టెన్సి తో చేయదు అంటూ పోల్చారు. ఇక బుమ్రా బౌలింగ్ ఆడుతూ.. ఆడుతూ.. బ్యాట్స్ మెన్ దరి తప్పి పోతారు అని పొగడ్తల వర్షం కురిపించారు. ట్రోఫీ మనింటికి తిరిగి వచ్చిందని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Unbelievable. Unstoppable. UNBEATEN Bharat!!
— Gautam Adani (@gautam_adani) March 8, 2026
Congratulations on the T20 2026 World Cup Championship! 🏆🇮🇳
New Zealand का हिसाब-किताब बराबर!
Sanju Samson of Vizhinjam QF / SF / Final Scores: 97, 89, 89.
इतनी कंसिस्टेंसी तो Adani के Vizhinjam Port के क्रेन में भी नहीं होती!… pic.twitter.com/tmfMLX8Rdm

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




