India's 30th Test Venue : చరిత్ర సృష్టించిన గౌహతి.. భారత్‌లో 30వ టెస్ట్ వేదికగా ఎంట్రీ

Indias 30th Test Venue : చరిత్ర సృష్టించిన గౌహతి.. భారత్‌లో 30వ టెస్ట్ వేదికగా ఎంట్రీ
x

India's 30th Test Venue : చరిత్ర సృష్టించిన గౌహతి.. భారత్‌లో 30వ టెస్ట్ వేదికగా ఎంట్రీ

Highlights

భారత క్రికెట్ చరిత్రలో నేటి నవంబర్ 22 ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. దాదాపు 92 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి, తొలిసారిగా ఈశాన్య భారతదేశాన్ని చేరుకున్నాయి.

India's 30th Test Venue : భారత క్రికెట్ చరిత్రలో నేటి నవంబర్ 22 ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. దాదాపు 92 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి, తొలిసారిగా ఈశాన్య భారతదేశాన్ని చేరుకున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌తో, గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం భారత టెస్ట్ క్రికెట్ వేదికల జాబితాలో 30వ పేరుగా చేరింది. ఈ చారిత్రక ఘట్టంతో ప్రపంచంలోనే అత్యధిక టెస్ట్ వేదికలు ఉన్న దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.

భారత్‌లో టెస్ట్ క్రికెట్ ప్రయాణం 1933 సంవత్సరంలో ముంబైలోని జింఖానా మైదానంలో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఆ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగింది. అయితే ఆ తర్వాత ఆ మైదానంలో మళ్లీ టెస్ట్ క్రికెట్ జరగలేదు. జింఖానా మైదానం నుంచి మొదలైన ఈ ప్రయాణం కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, కాన్పూర్, హైదరాబాద్, బెంగళూరు వంటి అనేక ప్రధాన నగరాల గుండా సాగి, ఇప్పుడు ఈశాన్య భారతదేశంలోని గౌహతిలోని బర్సపారా స్టేడియం వరకు విస్తరించింది.

గౌహతిలోని బర్సపారా స్టేడియం చేరికతో, భారత్ ఈ ఫార్మాట్‌లో 30 వేదికలతో రికార్డు నెలకొల్పింది. ఇందులో జింఖానా వంటి కొన్ని మైదానాలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత 16 వేదికలతో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది. టెస్ట్ క్రికెట్‌కు జన్మనిచ్చిన ఇంగ్లాండ్‌లో కేవలం 10 వేదికలు, ఆస్ట్రేలియాలో 11 వేదికలు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యలను బట్టి చూస్తే ప్రపంచంలో టెస్ట్ క్రికెట్‌ను అత్యధిక ప్రాంతాలకు విస్తరించిన దేశం భారత్ అని స్పష్టమవుతోంది.

టెస్ట్ క్రికెట్ ఆడే ఇతర ప్రముఖ దేశాల వేదికల సంఖ్యను పరిశీలిస్తే వెస్టిండీస్‌లో 12, దక్షిణాఫ్రికాలో 11, శ్రీలంకలో 8, బంగ్లాదేశ్‌లో 8, యూఏఈలో 4, జింబాబ్వేలో 3, ఐర్లాండ్‌లో 2 వేదికలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంగ్లాండ్ (10), ఆస్ట్రేలియా (11), న్యూజిలాండ్‌ (9) వంటి మూడు దేశాల్లో కలిపి ఉన్న మొత్తం టెస్ట్ వేదికల సంఖ్య (30), ఒక్క భారతదేశంలో ఉన్న వేదికల సంఖ్యకు సమానం కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories