
Hetmyer vs Bumrah: బుమ్రా దెబ్బకు హెట్మయర్ అబ్బా.. టీ20ల్లో మూగబోతున్న విండీస్ వీరుడి బ్యాట్!
Hetmyer vs Bumrah: టీ20 క్రికెట్లో బ్యాటర్, బౌలర్ మధ్య పోటీలు ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంటాయి.
Hetmyer vs Bumrah: టీ20 క్రికెట్లో బ్యాటర్, బౌలర్ మధ్య పోటీలు ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మయర్, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. బుమ్రా, హెట్మయర్ పోటీపడినపుడు మ్యాచ్‌లో ఉత్కంఠ ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. అయితే గణాంకాల పరంగా చూస్తే.. బుమ్రా దెబ్బకు హెట్మయర్ అబ్బా అంటున్నాడు. బుమ్రా బౌలింగ్ ముందు హెట్మయర్ సిక్సులు కొట్టే హెట్మయర్ బ్యాట్ మూగబోతోంది.
గణాంకాల ప్రకారం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మయర్ తడబడుతున్నాడు. భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లోనూ హెట్మయర్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. బుమ్రా బౌలింగ్‌ను ఇప్పటివరకు టీ20ల్లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఎదుర్కొన్నాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న హెట్మయర్.. కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు బుమ్రా అతన్ని ఐదు సార్లు ఔట్ చేశాడు. హెట్మయర్ సగటు కేవలం 3.00గా ఉండగా.. స్ట్రైక్‌రేట్ 71.42 మాత్రమే ఉండటం గమనార్హం.
ఈ గణాంకాలు చూస్తే.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మయర్ ఇబ్బందిపడుతున్నాడని స్పష్టమవుతోంది. సాధారణంగా బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్ మలుపుతిప్పగల హెట్మయర్ వంటి హిట్టర్‌ను కూడా బుమ్రా తన లైన్-లెంగ్త్, యార్కర్లతో అడ్డుకట్ట వేస్తున్నాడు. అందుకే కీలక మ్యాచ్‌లలో హెట్మయర్ క్రీజులోకి వచ్చినప్పుడు భారత కెప్టెన్లు బుమ్రాను బౌలింగ్‌కు తీసుకురావడం ఓ వ్యూహంగా మారింది. టీ20ల్లో ఈ బ్యాటర్-బౌలర్ పోటీలో ఇప్పటివరకు పూర్తి ఆధిపత్యం బుమ్రాదే. భవిష్యత్తు మ్యాచ్‌లలో హెట్మయర్ ఈ రికార్డును మార్చగలడా? లేక బుమ్రా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడా? అన్నది చూడాల్సి ఉంది.
టీ20ల్లో హెట్మయర్ vs బుమ్రా:
# ఎనిమిది ఇన్నింగ్స్
# 21 బంతుల్లో 15 పరుగులు
# ఐదు అవుట్లు
# సగటు 3.00
# స్ట్రైక్ రేట్ 71.42

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




