T20 World Cup 2026: రేపటి నుంచే టీ20 వరల్డ్ కప్ సమరం.. తొలి రోజే బరిలోకి టీమిండియా!

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి 24 గంటల సమయం కూడా లేదు.
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి 24 గంటల సమయం కూడా లేదు. రేపటి నుంచే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రేపటి నుంచి మార్చి 8వ తేదీ వరకు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరగనుంది. ప్రతిరోజు మూడు మ్యాచ్ ల చొప్పున టోర్నమెంట్ నిర్వహిస్తుంది ICC. టీమిండియా తన తొలి మ్యాచ్ రేపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఒక్కో గ్రూపులో ఐదు జట్ల చొప్పున మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూపు Aలో ఇండియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా,USA జట్లు ఉన్నాయి. ఈ మేరకు ఇండియా వర్సెస్ USA జట్ల మధ్య తొలి మ్యాచ్ రేపు జరుగుతుంది. రేపు టోర్నమెంట్ ప్రారంభం కాగానే పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా ఉదయం 11 గంటలకు మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు మరో మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక సాయంత్రం ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా చివరి మ్యాచ్ ఉంటుంది. ఇలా ప్రతిరోజు మూడు మ్యాచ్ లు నిర్వహిస్తారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



