
IND Playing 11: టీమిండియా ప్లేయింగ్ 11లో భారీ మార్పులు.. నమీబియా మ్యాచ్‌కు కొత్త కాంబినేషన్!
నమీబియా మ్యాచ్‌కు టీమిండియా జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనున్న భారత జట్టు ఆసక్తి రేపుతోంది.
టీ20 వరల్డ్‌కప్ 2026లో ఈరోజు నమీబియాతో జరిగే మ్యాచ్‌కు ముందు భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థి, పిచ్ పరిస్థితుల దృష్ట్యా జట్టు కాంబినేషన్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫిబ్రవరి 15న కొలంబోలో దాయాది పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేటి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు జరగనున్నాయో ఓసారి చూద్దాం.
ఓపెనర్ అభిషేక్ శర్మ నమీబియాతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో అతడికి రెస్ట్ ఇవ్వనున్నారు. అభిషేక్ స్థానంలో వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడనున్నాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఓపెనింగ్ చేస్తాడు. ప్రాక్టీస్ సందర్భంగా కిషన్ గాయపడినా.. అతడు మ్యాచ్ కోసం సిద్దంగానే ఉన్నాడు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇది టీమిండియాకు పెద్ద ఊరట. కొత్త బంతిని బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా పంచుకోనున్నాడు. పేసర్ అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఆడకపోవచ్చని తెలుస్తోంది.
నమీబియాతో మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని సమాచారం. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో స్పిన్ అటాక్‌ను ప్రయోగించే అవకాశం ఉంది. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని కెప్టెన్, కోచ్ భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ టీమిండియాకు కలిసొచ్చే అంశం. శివమ్ దూబే, రింకూ సింగ్ ఫినిషర్లుగా ఆడనున్నారు. సంజూ శాంసన్ ఒక్కడు ఫామ్ అందుకుంటే.. భారత జట్టుకు ఇక తిరుగుండదు. నమీబియా మ్యాచ్ కేవలం లీగ్ మ్యాచ్ అయినప్పటికీ,.. పాకిస్థాన్‌తో కీలక పోరుకు ముందు సరైన కాంబినేషన్ పరీక్షించుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మార్పులు ఫలిస్తే.. భారత్‌కు ముందున్న మ్యాచ్‌ల్లో మరింత బలం చేకూరే అవకాశముంది.
తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




