IND vs AUS 2nd test Day 2: రెండో టెస్టులో చెలరేగిన ట్రావిస్ హెడ్... టీమిండియా తడబాటు

IND vs AUS 2nd test Day 2: రెండో టెస్టులో చెలరేగిన ట్రావిస్ హెడ్... టీమిండియా తడబాటు
x
Highlights

IND vs AUS 2nd test match Day 2 score highlights: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో...

IND vs AUS 2nd test match Day 2 score highlights: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆసిస్ బ్యాటర్స్ చెలరేగిపోగా టీమిండియా బ్యాటర్స్ మరోసారి తడబడ్డారు. మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆసిస్ స్కోర్ 86/1 వద్ద ఉండగా రెండో రోజు ఆసిస్ ఆటగాళ్లు స్కోర్ బోర్డును ఉరకలెత్తించి 337 పరుగులకు ఆలౌటయ్యారు.

ట్రావిస్ హెడ్ 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సెక్సులు బాది 140 పరుగులతో ఆసిస్ స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. జస్ ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 4 వికెట్లు పడగొట్టారు. నితిన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తరువాత టీమిండియాపై ఆసిస్ జట్టు 157 పరుగుల తేడాతో ఆధిక్యంలో ఉంది.

ఆ తరువాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ ఆటగాళ్ల తడబాటు కారణంగా యశస్వి జైశ్వాల్ (24) శుబ్‌మన్ గిన్ (28) కేఎల్ రాహుల్ (7), విరాట్ కోహ్లీ (11) రోహిత్ శర్మ (6) ఇలా స్వల్ప స్కోర్‌కే టీమిండియా కీలకమైన వికెట్స్ నష్టపోయింది.

రిషబ్ పంత్ (28), నితీశ్ కుమార్ రెడ్డి (15) పరుగులతో నాటౌట్ గా కొనసాగుతున్నారు. ఇక టీమిండియా కూడా ఈ ఇద్దరు బ్యాటర్స్ పైనే ఆశలు పెట్టుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో టెస్టులో మొత్తంగా టీమిండియా 29 పరుగులతో వెనుకబడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories