IND vs AUS : టీ20 సిరీస్‌కు ఆసీస్ మాస్తర్ ప్లాన్.. టీంలో భారీ మార్పులు

IND vs AUS : టీ20 సిరీస్‌కు ఆసీస్ మాస్తర్ ప్లాన్.. టీంలో భారీ మార్పులు
x

IND vs AUS : టీ20 సిరీస్‌కు ఆసీస్ మాస్తర్ ప్లాన్.. టీంలో భారీ మార్పులు

Highlights

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్యలోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కీలకమైన మార్పులు చేసింది.

IND vs AUS : భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్యలోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కీలకమైన మార్పులు చేసింది. ఈ మార్పులు అక్టోబర్ 25న జరగబోయే చివరి వన్డేతో పాటు, అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు కూడా వర్తిస్తాయి. మొత్తం 9 మంది ఆటగాళ్లకు సంబంధించి ఈ మార్పులు జరిగాయి. ఇందులో ప్రధానమైనది స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి రావడం. భారత్‌తో జరగబోయే టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న కొత్త ఆటగాళ్లు ఎవరు? ఎవరు జట్టు నుంచి బయటకి వెళ్తున్నారు? చివరి వన్డేలో మార్పులేమిటనే పూర్తి వివరాలు ఈ వార్తలో చూద్దాం.

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా మణికట్టుకు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల క్రికెట్‌కు దూరమైన గ్లెన్ మాక్స్‌వెల్, భారత్‌తో జరగబోయే టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి వస్తున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో మాక్స్‌వెల్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడు. అయితే, మూడవ, నాల్గవ, ఐదవ టీ20 మ్యాచ్‌లకు అతన్ని జట్టులోకి తీసుకున్నారు.

మాక్స్‌వెల్‌తో పాటు, టీ20 జట్టులో మరో నలుగురు ఆటగాళ్లకు సంబంధించి కూడా మార్పులు జరిగాయి. జోష్ ఫిలిప్ ఐదు టీ20 మ్యాచ్‌లలోనూ జట్టులో ఉంటాడు. అలాగే, 20 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ మహ్లీ బియర్‌డ్‌మ్యాన్‌‎ను మూడవ, నాల్గవ, ఐదవ టీ20లకు సర్ప్రైజ్ ప్యాకేజీగా ఎంపిక చేశారు. మరో ఆటగాడు బెన్ డ్వార్షుయిస్‎ను నాల్గవ, ఐదవ టీ20ల కోసం జట్టులోకి తీసుకున్నారు.

ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు జట్టు నుంచి బయటకు వెళ్తున్నారు. ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మొదటి రెండు టీ20ల తర్వాత జట్టు నుంచి తప్పుకుంటాడు. అలాగే, షాన్ అబాట్ మొదటి మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత జట్టు నుంచి బయటకి వెళ్లే అవకాశముంది. భారత్‌తో అక్టోబర్ 25న జరగబోయే చివరి వన్డే కోసం ఆస్ట్రేలియా జట్టులో మార్పులు జరిగాయి. ఆస్ట్రేలియా జట్టులోకి జాక్ ఎడ్వర్డ్స్, మ్యాట్ కుహ్నేమాన్ తిరిగి వచ్చారు. ముఖ్యంగా, స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‎ను మూడవ వన్డే జట్టు నుంచి తప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories