Lords Test : బుమ్రా 5 వికెట్లు, రాహుల్ హాఫ్ సెంచరీ.. రెండో రోజు మ్యాచ్ హైలెట్స్ ఇవే

Lords Test : బుమ్రా 5 వికెట్లు, రాహుల్ హాఫ్ సెంచరీ.. రెండో రోజు మ్యాచ్ హైలెట్స్ ఇవే
x

Lords Test : బుమ్రా 5 వికెట్లు, రాహుల్ హాఫ్ సెంచరీ.. రెండో రోజు మ్యాచ్ హైలెట్స్ ఇవే

Highlights

లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసింది. ఈ రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సెంచరీ, జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ ల అదిరే బ్యాటింగ్ సహాయంతో ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Lords Test : లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసింది. ఈ రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సెంచరీ, జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ ల అదిరే బ్యాటింగ్ సహాయంతో ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం, తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా, రెండవ రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి, కెఎల్ రాహుల్ 113 బంతుల్లో 53 పరుగులు, రిషబ్ పంత్ 33 బంతుల్లో 19 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కంటే 242 పరుగుల వెనుకబడి ఉంది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం ఎనిమిది బంతుల్లో మూడు బౌండరీల సహాయంతో 13 పరుగులు చేసి, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది, రెండో వికెట్‌కు 61 పరుగుల మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని బెన్ స్టోక్స్, కరుణ్‌ను అవుట్ చేయడం ద్వారా విడదీశాడు. కరుణ్ 62 బంతుల్లో నాలుగు బౌండరీల సహాయంతో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎక్కువసేపు మైదానంలో ఉన్నా పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. అతను 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. మొదటి సెషన్‌లోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు జస్ ప్రీత్ బుమ్రా ఖాతాలోకి వెళ్లాయి. బుమ్రా కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే బెన్ స్టోక్స్(44), జో రూట్(104), క్రిస్ వోక్స్(0) లను పెవిలియన్‌కు పంపాడు.

దీని తర్వాత, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్ ధాటిగా బ్యాటింగ్ చేసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులకు పైగా జోడించారు. ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ 56 బంతుల్లో 51 పరుగులు చేసిన జేమీ స్మిత్‌ను అవుట్ చేశాడు. స్మిత్ అవుట్ అయిన తర్వాత, బుమ్రా జోఫ్రా ఆర్చర్ రూపంలో ఇంగ్లాండ్‌కు తొమ్మిదవ వికెట్ తీశారు. అయితే, వేగవంతమైన బౌలర్ బ్రైడన్ కార్స్ భారత్‌పై తన మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేయడంలో విజయం సాధించాడు. అతను 83 బంతుల్లో ఆరు బౌండరీల, ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. పైన పేర్కొన్న బ్యాట్స్‌మెన్‌లతో పాటు, మ్యాచ్ మొదటి రోజున జ్యాక్ క్రాలీ 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44 పరుగులు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories