IND vs ENG Lord's Test: సెంచరీకి ఒక పరుగు దూరంలో జో రూట్.. లార్డ్స్‌లో ఉత్కంఠ భరితంగా తొలి రోజు!

IND vs ENG Lords Test
x

IND vs ENG Lord's Test: సెంచరీకి ఒక పరుగు దూరంలో జో రూట్.. లార్డ్స్‌లో ఉత్కంఠ భరితంగా తొలి రోజు!

Highlights

IND vs ENG Lord's Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో మొదలైంది.

IND vs ENG Lord's Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో టెస్ట్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. రోజు చివరిలో జో రూట్ 191 బంతుల్లో అజేయంగా 99 పరుగులతో క్రీజులో ఉండగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ 102 బంతుల్లో 39 పరుగులు చేసి రెండో రోజు ఆట కోసం బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. భారత్ తరఫున నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.

లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఇంగ్లాండ్ జట్టులో జోష్ టోంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ జట్టులోకి రాగా, టీమిండియాలో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను చేర్చుకున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు నెమ్మదిగా మొదలైంది. అయితే, ఆంగ్ల జట్టు ఓపెనర్లు ఇద్దరినీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు. నితీష్ తన మొదటి ఓవర్‌లోనే బెన్ డకెట్(23), జాక్ క్రాలీ(18) వికెట్లు పడగొట్టి భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు.

ఆ తర్వాత జో రూట్, ఓలీ పోప్ బాధ్యతగా ఆడి, రెండో సెషన్‌లో భారత్‌కు ఒక్క వికెట్ కూడా తీయనివ్వలేదు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 211 బంతుల్లో 109 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని మూడో సెషన్‌లో రవీంద్ర జడేజా విడదీశాడు. 104 బంతుల్లో నాలుగు బౌండరీల సహాయంతో 44 పరుగులు చేసిన పోప్, జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం రూట్ మరియు స్టోక్స్ క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ ఇప్పటికే 170 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్ తన 37వ టెస్ట్ సెంచరీకి కేవలం ఒక పరుగు దూరంలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories