IND A vs PAK Shaheens: వైభవ్ సూర్యవంశీపై కోచ్ భారీ నమ్మకం..బుడ్డోడు దానిని నిలబెట్టుకుంటాడా?

IND A vs PAK Shaheens
x

IND A vs PAK Shaheens: వైభవ్ సూర్యవంశీపై కోచ్ భారీ నమ్మకం..బుడ్డోడు దానిని నిలబెట్టుకుంటాడా?

Highlights

IND A vs PAK Shaheens: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్థాన్. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ లో భాగంగా ఇప్పుడు ఇండియా A జట్టు, పాకిస్థాన్ షాహీన్స్‎తో తలపడనుంది.

IND A vs PAK Shaheens: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్థాన్. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ లో భాగంగా ఇప్పుడు ఇండియా A జట్టు, పాకిస్థాన్ షాహీన్స్‎తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 14 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. యూఏఈపై విధ్వంసకర సెంచరీ కొట్టిన వైభవ్, ఇప్పుడు తన కోచ్ ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి, పాకిస్థాన్‌పై కూడా సెంచరీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను ఇప్పటికే చూపించాడు. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్‌లోనే యూఏఈ బౌలర్లపై చెలరేగిపోయి సెంచరీ నమోదు చేశాడు. 'ఆరంభం బలంగా ఉంటే టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లడానికి మంచిది' అని యూఏఈ మ్యాచ్ తర్వాత వైభవ్ చెప్పిన విధంగానే, ఇప్పుడు మరింత మంచి చేయాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ షాహీన్స్‌పై కూడా అదే దూకుడు ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాడు.

పాకిస్థాన్ షాహీన్స్‌తో జరగబోయే ఈ కీలక మ్యాచ్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓఝా మాట్లాడుతూ..'వైభవ్ పాకిస్థాన్‌పై కూడా కచ్చితంగా సెంచరీ కొడతాడు' అని ధీమా వ్యక్తం చేశారు. తన గురువు ఇచ్చిన ఈ పెద్ద సవాల్‌ను, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యం ఇప్పుడు వైభవ్‌లో బలంగా ఉంది. ఇండియా A తరఫున ఆడుతున్న ఈ యువ ఓపెనర్ వైభవ్‌కు ఏ స్థాయిలో కూడా పాకిస్థాన్‌పై T20 మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. యూఏఈపై ఆడిందే అతని కెరీర్‌లో మొదటి T20. ఇప్పుడు రెండవ T20 మ్యాచ్ పాకిస్థాన్ షాహీన్స్‌తో ఆడుతున్నాడు. యూఏఈపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ పరోక్షంగా తన ఉద్దేశాన్ని వెల్లడించారు. సెంచరీ కొట్టడం సంతోషంగా ఉందని, కానీ తన పూర్తి దృష్టి ఇప్పుడు తరువాత మ్యాచ్‌పైనే ఉందని స్పష్టం చేశారు.

వైభవ్ సూర్యవంశీ కనుక ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే, అది ఇండియా A జట్టుకు టోర్నమెంట్‌లో రెండవ విజయాన్ని అందిస్తుంది. దీంతోపాటు, వైభవ్ సామర్థ్యంపై అతని గురువు పలికిన మాటను కూడా నిజం చేసినట్టు అవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories