Asia Cup 2025 : పాకిస్తాన్‌ను ఓడించడమే కాదు.. మరోసారి అవమానించిన టీమిండియా!

Asia Cup 2025 : పాకిస్తాన్‌ను ఓడించడమే కాదు.. మరోసారి అవమానించిన టీమిండియా!
x

Asia Cup 2025 : పాకిస్తాన్‌ను ఓడించడమే కాదు.. మరోసారి అవమానించిన టీమిండియా!

Highlights

ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించడమే కాకుండా, బహిరంగంగా అవమానించింది. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెటర్లతో చేతులు కలపడానికి నిరాకరించారు. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి మొదలుపెట్టి, మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు.

Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించడమే కాకుండా, బహిరంగంగా అవమానించింది. భారత ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెటర్లతో చేతులు కలపడానికి నిరాకరించారు. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి మొదలుపెట్టి, మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. పాకిస్తాన్ ఆటగాళ్లు చేతులు కలపడానికి ఆసక్తి చూపినప్పటికీ, భారత జట్టులోని ఏ ఒక్క సభ్యుడు కూడా వారితో షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. భారత ఆటగాళ్ల ఈ చర్య ఇప్పుడు పెద్ద దుమారాన్ని సృష్టించింది. దీనిపై ఆగ్రహించిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్, టీమిండియాపై ఫిర్యాదు చేసింది.

చేతులు కలపడానికి నిరాకరించినందుకు ఆగ్రహించిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మేనేజర్, పీసీబీ ఆదేశాల మేరకు భారత జట్టుపై ఫిర్యాదు చేశారు. దీనికి ముందు సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయకులకు అంకితం చేశాడు. భారత జట్టుకు వారి ఉన్నతాధికారుల నుండి పాక్ ఆటగాళ్లతో చేతులు కలపకూడదని కఠినమైన ఆదేశాలు ఉన్నాయని సమాచారం. జట్టులోని ఆటగాళ్లందరూ అదే ఆదేశాలను పాటించారు. సమాచారం ప్రకారం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఈ విషయంపై అరగంట పాటు ఒక సమావేశం కూడా జరిగింది.

భారత ఆటగాళ్లు చేతులు కలపడానికి నిరాకరించడంపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఈ వైఖరి వారికి నచ్చలేదు. మాజీ పాక్ క్రికెటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. "ఇది ఆసియా కప్ మాత్రమే, ఐసీసీ టోర్నమెంట్లలో కూడా ఇలాగే జరగవచ్చు" అని హెచ్చరించాడు. బసిత్ అలీతో కలిసి టీవీ షోలో పాల్గొన్న కమ్రాన్ అక్మల్ కూడా భారత్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది క్రికెట్ భవిష్యత్తుకు మంచిది కాదని అన్నాడు.

పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్ భారత జట్టు ప్రవర్తనపై తీవ్రంగా స్పందిస్తూ.. "ఇలా చేయడం ద్వారా వారు తమ అసలు రంగును చూపించారు" అని విమర్శించాడు. రషీద్ లతీఫ్ ఈ మొత్తం వ్యవహారంపై ఐసీసీని కూడా ప్రశ్నించాడు. "ఐసీసీ ఎక్కడ ఉంది?" అని అడిగాడు. చేతులు కలపడానికి నిరాకరించడంపై పాకిస్తాన్ ఆగ్రహం చూస్తుంటే, వారికి గట్టి సమాధానం లభించిందని స్పష్టమవుతోంది. ఈ సంఘటనతో విసిగిపోయి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌కు కూడా హాజరు కాలేదు. పాక్ టీమ్ కోచ్ కూడా ఈ సంఘటనతో బాధపడి ఉండవచ్చు. కానీ, టీమిండియా చేసిన ఈ పని ద్వారా పహల్గాంలో జరిగిన సంఘటనను మేము ఇంకా మర్చిపోలేదని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories