
IND vs PAK: భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే.. పాకిస్థాన్ పాయింట్స్ , నెట్ రన్‌రేట్‌పై భారీ ప్రభావం!
IND vs PAK: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి ఉంటుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు.
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి ఉంటుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. టీ20 వరల్డ్‌కప్ 2026లో దాయాదుల పోరు చూడడానికి ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. కానీ బంగ్లాకు మద్దుతుగా తాము మ్యాచ్ ఆడమంటూ పాక్ పెద్ద బాంబ్ పేల్చింది. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నాం అని ప్రకటించింది. కీలక మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే.. దాని ప్రభావం కేవలం ఆ మ్యాచ్ వరకే కాకుండా మొత్తం టోర్నమెంట్‌పై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పాయింట్లు, నెట్ రన్‌రేట్ విషయంలో పాకిస్థాన్‌కు భారీ నష్టం తప్పదు.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక జట్టు మ్యాచ్ ఆడటానికి నిరాకరిస్తే, ఆ మ్యాచ్‌ను ఫోర్ఫిట్ (రద్దు) చేసినట్లుగా పరిగణిస్తారు. ఈ పరిస్థితిలో భారత్ మ్యాచ్ ఆడకుండానే పూర్తి 2 పాయింట్లు దక్కించుకుంటుంది. మరోవైపు పాకిస్థాన్‌కు ఒక్క పాయింట్ కూడా రాదు. అంటే పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌కు నేరుగా భారీ దెబ్బ పడినట్లే. ఇక్కడ మరో కీలకమైన అంశం నెట్ రన్‌రేట్. మ్యాచ్ బహిష్కరణ చేసిన జట్టుపై ఐసీసీ చాలా కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంది. ఆ నియమాల ప్రకారం.. పాకిస్థాన్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 0 పరుగులు చేసినట్లుగా లెక్కిస్తారు. ఇది పాకిస్థాన్ నెట్ రన్‌రేట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకే మ్యాచ్‌తో పాక్ నెట్ రన్‌రేట్ భారీగా మైనస్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే..భారత్‌కు ఈ మ్యాచ్ వల్ల నెట్ రన్‌రేట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. భారత్ మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు మాత్రమే పొందుతుంది కానీ.. నెట్ రన్‌రేట్ లెక్కల్లో ఈ మ్యాచ్ చేరదు. దీంతో పాకిస్థాన్‌కు పెను నష్టం, భారత్‌కు లాభం చేకూరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారత్ మ్యాచ్‌ను బహిష్కరించడం పాకిస్థాన్‌కు పెద్ద బొక్క అవుతుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ పరిస్థితుల్లో 2 పాయింట్లు కోల్పోవడమే కాకుండా నెట్ రన్‌రేట్ పూర్తిగాపడిపోవడం వల్ల పాకిస్థాన్ సూపర్ 8 అవకాశాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. క్రికెట్ విశ్లేషకులు కూడా మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం పాకిస్థాన్‌కే పెద్ద నష్టం చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా మనకు మాత్రం ఆడకుండానే 2 పాయింట్స్ వస్తాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




