IND vs PAK T20 World Cup 2026: దాయాదుల పోరుకు సై.. టీమిండియాలో సిక్సర్ల వీరుడు! పాక్ పతనం ఖాయమేనా?

IND vs PAK T20 World Cup 2026
x

IND vs PAK T20 World Cup 2026: దాయాదుల పోరుకు సై.. టీమిండియాలో సిక్సర్ల వీరుడు! పాక్ పతనం ఖాయమేనా?

Highlights

IND vs PAK T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరు! పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా 'సిక్సర్ల వీరుడు' ఎంట్రీ. కొలంబోలో వర్షం గండం, రికార్డులు మరియు ప్లేయింగ్ ఎలెవన్ పూర్తి వివరాలు.

IND vs PAK T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద యుద్ధానికి రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్ - పాకిస్తాన్ జట్లు నేడు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత రికార్డులు భారత్‌కే అనుకూలంగా ఉన్నప్పటికీ, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది.

శివరాత్రి పూట.. సచిన్ రేంజ్ 'శివతాండవం' ఎవరిది?

నేడు మహా శివరాత్రి కావడం విశేషం. 2003 ప్రపంచ కప్‌లో ఇదే శివరాత్రి రోజున మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (98 పరుగులు) పాక్ బౌలర్లపై విరుచుకుపడి 'శివతాండవం' ఆడాడు. నేడు సూర్యకుమార్ సేనలో ఆ రేంజ్ విధ్వంసం సృష్టించే 'సిక్సర్ల వీరుడు' ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు ఫుల్ ఫామ్‌లో ఉండటంతో భారత్ 250+ పరుగులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వాతావరణం: వరుణ గండం పొంచి ఉందా?

క్రికెట్ అభిమానులను కలవరపెట్టే అంశం ఒక్కటే.. అది వర్షం.

♦ కొలంబో వాతావరణ శాఖ ప్రకారం నేడు వర్షం కురిసే అవకాశం ఉంది.

♦ ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ ఓవర్లను కుదించే అవకాశం ఉంది.

♦ పరుగుల వరద చూడాలనుకుంటున్న ఫ్యాన్స్, వరుణుడు కరుణించాలని కోరుకుంటున్నారు.

ముఖాముఖి పోరు

టీ20ల్లో భారత్-పాక్ రికార్డులు ఇలా ఉన్నాయి:

మొత్తం మ్యాచ్‌లు: 16

♦ భారత్ విజయం: 13

♦ పాకిస్తాన్ విజయం: 03

ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ (Playing XI)

టీమ్ ఇండియా:

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్తాన్:

సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా (C), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (WK), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్.

Show Full Article
Print Article
Next Story
More Stories