Rishabh Pant : అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన రిషబ్ పంత్

Rishabh Pant : అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన రిషబ్ పంత్
x

Rishabh Pant : అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన రిషబ్ పంత్

Highlights

సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు ఎదురైన పరాభవం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 0-2తో సిరీస్ కోల్పోవడంపై ఆటగాళ్ల నుంచి కోచ్ వరకు అందరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Rishabh Pant : సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు ఎదురైన పరాభవం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 0-2తో సిరీస్ కోల్పోవడంపై ఆటగాళ్ల నుంచి కోచ్ వరకు అందరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గౌహతి టెస్టులో జట్టుకు నాయకత్వం వహించిన వైస్-కెప్టెన్ రిషబ్ పంత్ ఆటతీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పంత్ తన వైఫల్యంపై స్పందించారు. అభిమానులకు క్షమాపణలు చెప్తూ త్వరలోనే బలంగా తిరిగి వస్తానని భరోసా ఇచ్చారు.

సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. చివరి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడకపోవడంతో, ఆ మ్యాచ్‌కు నాయకత్వం వహించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, సిరీస్ ఓటమి తర్వాత తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. "గత రెండు వారాలుగా మేము మంచి క్రికెట్ ఆడలేదనే వాస్తవాన్ని దాచలేం. ఒక జట్టుగా, ఆటగాళ్లుగా మేము ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని, కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో నవ్వు తీసుకురావాలని కోరుకుంటాము. ఈసారి మేము మీ నిరీక్షణలకు తగినట్టు ఆడలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నాను. కానీ, క్రీడలు మీకు ఒక జట్టుగా, వ్యక్తిగా నేర్చుకోవడానికి, ఎదగడానికి, పరిస్థితులకు అనుగుణంగా మారడానికి, ముందుకు సాగడానికి అవకాశాన్ని ఇస్తాయి" అని పంత్ అన్నాడు.

ఈ టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌లందరూ విఫలమైనప్పటికీ, పంత్ ప్రదర్శనపై ప్రత్యేకంగా విమర్శలు వచ్చాయి. పంత్ ఆడిన రెండు టెస్టుల్లో కేవలం 49 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా గౌహతి టెస్టులో పంత్ వికెట్ కోల్పోయిన విధానం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పంత్‌ను ఉద్దేశించి.. "మీరు ప్రేక్షకుల కోసం కాకుండా జట్టు కోసం ఆడాలి" అని పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సిరీస్‌లో పంత్ తన ఆటగాళ్లపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా కనిపించింది. ఈ మొత్తం సిరీస్ పంత్‌కు ఒక పీడకల లాంటిది అని చెప్పవచ్చు.

పంత్ తన మెసేజ్ చివరలో.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం మా జీవితంలో అతిపెద్ద గౌరవం. ఈ జట్టు సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. మేము కష్టపడి పనిచేస్తాము. మళ్లీ ఏకమవుతాము, దృష్టి సారించి బలంగా తిరిగి వస్తాము" అని అభిమానులకు భరోసా ఇచ్చాడు. భారత జట్టుకు ఇక వచ్చే ఏడాది వరకు టెస్ట్ మ్యాచ్‌లు లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories