IND vs SA T20 : సంజు శాంసన్‌కు ఆఖరి అవకాశం.. కోచ్ గంభీర్‌ను ఒప్పించాలంటే ఇదే ఛాన్స్

IND vs SA T20
x

IND vs SA T20 : సంజు శాంసన్‌కు ఆఖరి అవకాశం.. కోచ్ గంభీర్‌ను ఒప్పించాలంటే ఇదే ఛాన్స్

Highlights

IND vs SA T20 :భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీసులో ఆఖరి నిర్ణయాత్మక మ్యాచ్ శుక్రవారం, డిసెంబర్ 19 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

IND vs SA T20: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీసులో ఆఖరి నిర్ణయాత్మక మ్యాచ్ శుక్రవారం, డిసెంబర్ 19 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో సిరీస్ గెలుపు కంటే, టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ భవిష్యత్తు మీదే ఎక్కువ దృష్టి ఉంది. వైస్ కెప్టెన్, ఓపెనర్ అయిన శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ సమయంలో కాలికి గాయం కావడంతో నాలుగో టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సంజుకు ఆడే అవకాశం దక్కలేదు. అయితే గిల్ చివరి మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని వస్తున్న నివేదికల నేపథ్యంలో సంజు శాంసన్‌కు శుక్రవారం జరగబోయే ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ స్థానంలో అవకాశం లభించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

అహ్మదాబాద్ టీ20 మ్యాచ్ ఈ సిరీస్‌కు చివరిది. దీని తరువాత టీమిండియా జనవరిలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సిద్ధం కావాలి. ఈ కీలక సమయంలో సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో పెద్ద స్కోర్ చేయలేకపోతే న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ తిరిగి ఓపెనర్‌గా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ దృష్టిలో సంజు శాంసన్‌కు ఇది అన్యాయంగా కనిపించినప్పటికీ, జట్టు యాజమాన్యం, కోచ్ గౌతమ్ గంభీర్.. గిల్‌ను అన్ని ఫార్మాట్లలో కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 2025 లో 15 టీ20 మ్యాచ్‌లలో కేవలం 291 పరుగులు మాత్రమే చేసినా, గిల్‌కు నిరంతరం అవకాశాలు ఇస్తున్నారు.

సంజు శాంసన్‌కు ఈ అహ్మదాబాద్ టీ20 మ్యాచ్‌ ఒక డూ ఆర్ డై పరిస్థితి. ఈ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్‌తో 3 వన్డే మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఒకవేళ గిల్ ఆ వన్డేలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తే, ఫామ్ పేరు చెప్పి టీ20 సిరీస్‌లోనూ అతన్నే ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. అందువల్ల సంజు శాంసన్ తనకున్న ఈ ఏకైక అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కేవలం టీ20 ఫార్మాట్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు చేసిన తన సామర్థ్యాన్ని ఈ ఒక్క మ్యాచ్‌లో నిరూపించుకోవాలి. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు అతన్ని ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించేలా మంచి ప్రదర్శనతో బలవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories