
IND vs SA: సుందర్ కోసం అక్షర్ పటేల్‌ను డ్రాప్ చేయడం ఏంటి?.. గంభీర్–సూర్య నిర్ణయంపై సందేహాలు!
వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుని అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంపై చర్చ.. టీమ్ మేనేజ్మెంట్ వ్యూహంపై అభిమానుల్లో సందేహాలు.
టీ20 ప్రపంచకప్ 2026లోని మూడు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు, 12.16 సగటు, 6.63 ఎకానమీ.. ఇలాంటి అద్భుత గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం సాధారణంగా ఎవ్వరూ ఊహించరు. అయితే కీలకమైన సూపర్-8లో దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను జట్టులో నుంచి తప్పించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అక్షర్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా దాయాది పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో 2/29 గణాంకాలు నమోదు చేసి తానేంటో నిరూపించుకున్నాడు.
అద్భుత ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి.. ఇటీవల పెద్దగా మ్యాచ్‌లు ఆడని మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులో చోటు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. అక్షర్‌కు గాయం జరిగిందేమో అనుకుంటే.. అలాంటిదేమీ లేకుండానే అతడిపై వేటు వేటు వేశారు. మ్యాచ్‌లో సుందర్‌తో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేయించగా.. అతడు వికెట్ తీయకుండా 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో 11 బంతుల్లో 11 పరుగులకే పరిమితమయ్యాడు. అందులో కూడా ఓ సిక్సర్ ఉండడం విశేషం. నమ్మకంతో ఐదవ స్థానంలో బరిలోకి దింపగా.. పూర్తిగా నిరాశపరిచాడు.
అక్షర్ పటేల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సొంత మైదానం. అక్కడ అతనికి మంచి రికార్డు ఉంది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా అతను జట్టుకు వైవిధ్యం తీసుకువచ్చే సామర్థ్యం ఉన్నవాడు. బ్యాటింగ్‌లో కూడా వాషింగ్టన్ సుందర్ కన్నా మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై సుందర్‌ను అయిదో స్థానంలో పంపడం కూడా జట్టుకు ప్రయోజనం కలిగించలేదు. ఈ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏమిటో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్‌కే తెలియాలని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జట్టు కాంబినేషన్‌పై తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా ఇటీవలి మ్యాచ్‌ల్లో ఫామ్‌లో లేరు. అయినప్పటికీ వారిని కొనసాగిస్తూ.. ఫామీదున్న అక్షర్‌ను తప్పించడం ఎందుకని క్రికెట్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. జట్టు సమతుల్యత, ఆల్‌రౌండ్ ఆప్షన్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఎంపికలు చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి, తదుపరి మ్యాచ్‌లలో మార్పులు ఉంటాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- India vs South Africa
- IND vs SA
- Axar Patel
- Washington Sundar
- Axar Patel dropped
- Washington Sundar selection
- India vs South Africa analysis
- T20 World Cup 2026
- Team India selection controversy
- Suryakumar Yadav
- Gautam Gambhir decision
- cricket news
- India playing XI debate
- Why Was Axar Patel Dropped for Washington Sundar
- Gambhir–Surya Decision Questioned in IND vs SA Match

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




